అమరుడైన భర్తకు నివాళిగా భారత సైన్యంలో చేరిన భార్య, …పుల్వామా చరిత్రలో నూతన ఘట్టం ఆవిష్కరణ

| Edited By: Phani CH

May 29, 2021 | 1:22 PM

పుల్వామా చరిత్రలోనే ఇది తొలి ఘట్టం...2018 లో జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి సందర్భంగా మేజర్ విభూతి శంకర్ డౌన్ద్యాల్ అమరులయ్యారు.

అమరుడైన భర్తకు నివాళిగా భారత సైన్యంలో చేరిన భార్య, ...పుల్వామా చరిత్రలో నూతన ఘట్టం ఆవిష్కరణ
Pulwama Martyr Major Dhoundiyal Wife Join In Army
Follow us on

పుల్వామా చరిత్రలోనే ఇది తొలి ఘట్టం…2018 లో జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి సందర్భంగా మేజర్ విభూతి శంకర్ డౌన్ద్యాల్ అమరులయ్యారు. ఉగ్రవాదుల కాల్పులకు బలయ్యారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గాను 2019 లో ఆయనకు ప్రభుత్వం మరణానంతర ‘శౌర్య చక్ర’ అవార్డును ప్రధానం చేసింది. అయన భార్య నిఖితా కౌల్ తన భర్త మృతికి నివాళిగా ఇండియన్ ఆర్మీలో చేరింది. నార్తర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ వై.కె.జోషి స్వయంగా ఆమె భుజాలపై మూడు గుర్తులున్న సైనిక స్టార్స్ ని పిన్ చేశారు. 27 ఏళ్ళ కౌల్.. దేశానికి తాను కూడా సేవ చేయగోరుతున్నానని, ఇదే తన భర్తకు తను ఘటిస్తున్న ట్రిబ్యూట్స్ అని పేర్కొంది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఆమెకు గర్వ కారణమని, ఇది ప్రౌడ్ మూమెంట్ అని రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో తెలిపింది. కాగా మేజర్ విభూతి శంకర్ కి వివాహమైన 9 నెలలకే ఆయన అమరుడయ్యాడు.

కానీ ఆయన మృతిని తలచుకుంటూ కుమిలి[పోకుండా నిఖితా కౌల్.. భారత సైన్యంలో చేరాలనుకుని..అందుకు అనుగుణంగా షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరై ఉత్తీర్ణురాలైంది. అనంతరం సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూకు వెళ్లి అక్కడ కూడా నెగ్గింది. చెన్నైలోని సైనిక శిక్షణ కేంద్రంలో కొంతకాలంపాటు ట్రెయినింగ్ తీసుకుంది. ఇప్పుడు తనకు ఎంతో తృప్తిగా ఉందని, ఇదే నా ఆశయమని ఆమె చెబుతోంది. మిలిటరీ వర్గాలు కూడా ఆమెను ప్రశంసిస్తున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అనంతపురంలో వింత ఆచారం.. వేంకటేశ్వరునికి బాలికతో మొదటి వివాహం.. ( వీడియో )

River: ఇండియాలో సముద్రంలో కలవని ఏకైక జీవనది ఇదే..! నీరు ఒక దగ్గర తియ్యగా మరో దగ్గర ఉప్పగా..? ( వీడియో )