పుల్వామా దాడిలో మహిళా టెర్రరిస్ట్, షాకింగ్ డీటెయిల్ !

గత ఏడాది జరిగిన పుల్వామా దాడిలో జైషే మహ్మద్ టెర్రరిస్టులకు ఇన్ షా జాన్ అనే 23 ఏళ్ళ మహిళ సహకరించిందంటే ఆశ్చర్యం కలగక మానదు. పాకిస్థానీ బాంబ్ మేకర్ అయిన మహ్మద్ ఉమర్ ఫరూక్ కి ఆమె ఎంతగానో సహకరించిందని.....

పుల్వామా దాడిలో మహిళా టెర్రరిస్ట్, షాకింగ్ డీటెయిల్ !

Edited By:

Updated on: Aug 27, 2020 | 11:00 AM

గత ఏడాది జరిగిన పుల్వామా దాడిలో జైషే మహ్మద్ టెర్రరిస్టులకు ఇన్ షా జాన్ అనే 23 ఏళ్ళ మహిళ సహకరించిందంటే ఆశ్చర్యం కలగక మానదు. పాకిస్థానీ బాంబ్ మేకర్ అయిన మహ్మద్ ఉమర్ ఫరూక్ కి ఆమె ఎంతగానో సహకరించిందని పుల్వామా ఘటనపై దర్యాప్తు జరుపుతున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ తన నివేదికలో తెలిపింది. అయితే గత మార్చిలో భద్రతా దళాల కాల్పుల్లో ఉమర్ ఫరూక్ మరణించాడు. ఇన్ షా జాన్ ఇతర ఉగ్రవాదులతో కూడా ఫోన్ లో టచ్ లో ఉంటూ వచ్ఛేదట. తమ 13,500 పేజీల రిపోర్టులో అధికారులు ఈమె పేరును కూడా ప్రస్తావించారు. ఈమె తండ్రి తారిఖ్ వీర్ కి తన కూతురి యవ్వారం తెలుసునని, తండ్రీ కూతుళ్లిద్దరూ గతంలో ఉగ్రవాదులకు తమ ఇంట్లో బస, భోజన, ఇతర సౌకర్యాలు సమకూర్చేవారని తెలిసింది. చిన్న వయస్సులోనే ఇన్ షా జాన్ ఉగ్రవాదంవైపు ఎలా మళ్లిందో అధికారులకు తెలియడంలేదు.

ఇన్ని పేజీల నివేదికలో పుల్వామా ఎటాక్ గురించి అధికారులు వివరించారు గానీ మరి ఈ ‘కుర్ర మహిళా ఉగ్రవాది’ గురించి మాత్రం, ఆమె పట్టుబడిందా లేక అరెస్టు చేశారా అన్న విషయాలను వెల్లడించలేదు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us