బీజేపీ, ఎన్ ఆర్ కాంగ్రెస్ పార్టీలదే ఈ ‘నిర్వాకం’, పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి ఫైర్

| Edited By: Anil kumar poka

Feb 22, 2021 | 12:28 PM

పుదుచ్చేరి అసెంబ్లీలో సీఎం నారాయణస్వామి సోమవారం తన మెజారిటీని నిరూపించుకోలేకపోయారు. బలపరీక్షలో నెగ్గలేకపోయారు.

బీజేపీ, ఎన్ ఆర్ కాంగ్రెస్ పార్టీలదే ఈ నిర్వాకం, పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి ఫైర్
Follow us on

Puducherry Government: పుదుచ్చేరి అసెంబ్లీలో సీఎం నారాయణస్వామి సోమవారం తన మెజారిటీని నిరూపించుకోలేకపోయారు. బలపరీక్షలో నెగ్గలేకపోయారు. విశ్వాస తీర్మానం గురించి స్పీకర్ మాట్లాడుతుండగానే కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం, ఆ వెంటనే నారాయణ స్వామి కూడా సభ నుంచి నిష్క్రమించడం జరిగాయి. రాజ్ భవన్ కు వెళ్లి నారాయణస్వామి తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ కు సమర్పించారు.

తాజా పరిణామాలతో సభలో కాంగ్రెస్-డీఎంకే బలం 11 కి తగ్గిపోయింది. ప్రతిపక్ష సభ్యులు 14 మంది ఉన్నారు. తన ప్రభుత్వం కుప్ప కూలడానికి బీజేపీ, ఎన్ ఆర్ కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆ తరువాత నారాయణస్వామి ఆరోపించారు. ప్రజాస్వామ్యబధ్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అడ్డదారిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం ద్వారా కూల్చివేయడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన అన్నారు.

ఇది రాజకీయ వ్యభిచారమే అని దుయ్యబట్టారు. తాము ఎన్నికలను ఎదుర్కొంటామని, చివరకు సత్యమే జయిస్తుందన్నారు. ఈ రోజు మాకు జరిగింది రేపు మీకు జరగవచ్చు అని  పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. మొదట నలుగురు ఎమ్మెల్యేలు, ఆ తరువాత నిన్న  డీఎంకే సహా ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మైనారిటీలో పడిపోయింది.

మరిన్ని చదవండి ఇక్కడ :

అందంగా ఉందని యువతిని ఉద్యోగం నుంచి తొలగింపు : women dismissed from job due to her beauty video

దుబాయ్ పోలీస్ స్టేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు : Mahesh Babu in Dubai Smart police Station Video