Influenza Cases on the Rise: పిల్లల్లో పెరుగుతున్న ఇన్‌ఫ్లుఎంజా కేసులు… ఈ నెల 25వరకు స్కూళ్లు మూసివేత..

|

Sep 18, 2022 | 6:25 PM

ఇన్‌ఫ్లుఎంజా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి పిల్లలు తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలని, ముఖానికి మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని సూచించారు.

Influenza Cases on the Rise: పిల్లల్లో పెరుగుతున్న ఇన్‌ఫ్లుఎంజా కేసులు… ఈ నెల 25వరకు స్కూళ్లు మూసివేత..
Holidays
Follow us on

Influenza Cases on the Rise: పిల్లల్లో పెరుగుతున్న ఇన్‌ఫ్లుఎంజా కేసులు భయపెడుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పెద్ద సంఖ్యలో పిల్లలు ఇన్‌ఫ్లుఎంజా బారినపడటంతో అక్కడ స్కూళ్లను మూసివేశారు. ఈ నెల 25 వరకు సెలవు ప్రకటించారు. పుదుచ్చేరిలో ఇటీవల పిల్లలు పెద్ద సంఖ్యలో జలుబు, దగ్గు, జ్వరం బారిన పడుతున్నారు. ఆసుపత్రుల్లో నమోదయ్యే 50 శాతం ఇన్‌ఫ్లుఎంజా కేసులు పిల్లలవే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, విద్యాశాఖ మంత్రి ఏ నమశ్శివాయం కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 25 వరకు 1-8 తరగతుల విద్యార్థులకు క్లాసులు రద్దు చేసి సెలవు ప్రకటించారు. పుదుచ్చేరి పాఠశాల విద్యా డైరెక్టరేట్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. ఇన్‌ఫ్లుఎంజా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి పిల్లలు తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలని, ముఖానికి మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని సూచించారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ భూభాగంలోని ప్రభుత్వ క్లినిక్‌లు, పిహెచ్‌సిలలో ప్రత్యేక ఫీవర్ క్లినిక్‌లను కూడా ప్రారంభించింది. అన్ని జ్వరాల క్లినిక్‌ల, పిహెచ్‌సిలలో వైద్యులు ఉండేలా చూడాలన్నారు.

కోవిడ్ -19 కేసుల సంఖ్య తగ్గిన తరువాత, ప్రజలు మాస్క్‌లు లేకుండా మార్కెట్‌లు, బహిరంగ ప్రదేశాలకు తరలి వస్తున్నారు. ఇది ఫ్లూ లాంటి జ్వరం వ్యాప్తికి దారితీసిందన్నారు. జ్వరం సోకిన రోగులు ఫేస్ మాస్క్‌లు ధరించాలని, వ్యాప్తి చెందకుండా ఉండటానికి కుటుంబంలోని ఇతర సభ్యుల దూరం పాటించాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి