అయినా రైతుల ఆందోళనలు ఆగవు.. అప్పటి వరకు కొనసాగిస్తాం: రాకేష్ తికాయత్ ప్రకటన

|

Nov 19, 2021 | 11:16 AM

PM Narendra Modi: జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని స్పష్టంచేశారు.

అయినా రైతుల ఆందోళనలు ఆగవు.. అప్పటి వరకు కొనసాగిస్తాం: రాకేష్ తికాయత్ ప్రకటన
Rakesh Tikait
Follow us on

జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని స్పష్టంచేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతోనే ఈ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు స్పష్టంచేసిన ప్రధాని మోడీ.. అయితే కొత్త చట్టాల విషయంలో కొందరు రైతులను ఒప్పించడంలో విఫలం చెందినట్లు చెప్పారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొత్త చట్టాల కారణంగా రైతులకు కలిగిన ఇబ్బందులకు తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ ప్రకటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలుచోట్ల రైతు సంఘాలు వేడుకలు జరుపుకుంటున్నారు. మిఠాయిలు పంచి తమ సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు.

మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామంటూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై భారతీయ కిసాన్ యూనియన్(BKU) నేత రాకేష్ తికాయత్ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన..  పార్లమెంటులో వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు రైతుల ఆందోళన కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇప్పటికిప్పుడు ప్రధాని మోడీ ప్రకటనతో ఆందోళనలు విరమించబోమని తేల్చిచెప్పారు.

Also Read..

3 Farm Laws: అసలు 3 వ్యవసాయ చట్టాల్లో ఉన్న అంశాలేంటి..?.. పూర్తి వివరాలు మీ కోసం

Rahul Gandhi: రైతుల సత్యాగ్రహంతో కేంద్రం దిగివచ్చింది.. వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు