‘సిటిజెన్‌షిప్ ‘బిల్లుపై అట్టుడికిన దేశం.. నిరసన సెగల పర్వం

| Edited By: Ravi Kiran

Dec 10, 2019 | 5:18 PM

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబుకుతున్నాయి. (హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన ఈ బిల్లును లోక్ సభ ఆమోదించిన సంగతి తెలిసిందే). ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ వంటి సంస్థలు ఢిల్లీలో వేర్వేరు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. రాజ్యాంగ విరుధ్ధమైన ఈ బిల్లును తాము ఖండిస్తున్నామని, ఇది హిందూ-ముస్లిం ఐక్యతను దెబ్బ తీసేదిగా ఉందని ఏఐడీయుఎఫ్ నేత, ఎంపీ కూడా అయినా బద్రుద్దీన్ అజ్మల్ […]

సిటిజెన్‌షిప్ బిల్లుపై అట్టుడికిన దేశం.. నిరసన సెగల పర్వం
Follow us on

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబుకుతున్నాయి. (హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన ఈ బిల్లును లోక్ సభ ఆమోదించిన సంగతి తెలిసిందే). ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ వంటి సంస్థలు ఢిల్లీలో వేర్వేరు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. రాజ్యాంగ విరుధ్ధమైన ఈ బిల్లును తాము ఖండిస్తున్నామని, ఇది హిందూ-ముస్లిం ఐక్యతను దెబ్బ తీసేదిగా ఉందని ఏఐడీయుఎఫ్ నేత, ఎంపీ కూడా అయినా బద్రుద్దీన్ అజ్మల్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ సంస్థ సభ్యులు జంతర్ మంతర్ రోడ్డులో ఆందోళన నిర్వహించారు. అలాగే ముస్లిం లీగ్ కు చెందిన ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు కూర్చున్నారు.


అస్సాంలో భారీ ప్రదర్శనలు జరిగాయి. 1985 నాటి అస్సాం ఒప్పందంలోని నిబంధనలను ఈ బిల్లు కాలరాచేదిగా ఉందని ఆందోళనకారులు దుయ్యబట్టారు. ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్లకార్డులు చేతబట్టిన నిరసనకారులు గౌహతిలో అనేకచోట్ల షాపులను మూయించి వేయించారు. పశ్చిమ బెంగాల్, అగర్తల వంటి రాష్ట్రాల్లోనూ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ఇది చట్టమైన పక్షంలో పొరుగునున్నపాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారీ సంఖ్యలో ముస్లిమేతరులు శరణార్థులుగా ఈ దేశానికి చేరుకుంటారని, వారికి భారత పౌరసత్వం లభిస్తే స్థానికులమైన తమకు అన్యాయం జరుగుతుందని,ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలో ఇప్పటికే ఎన్నార్సీని అమలు చేసిన కారణంగా సుమారు 19 లక్షల మంది పేర్లను జాబితా నుంచి తొలగించినప్పటికే.. వారు ట్రిబ్యునల్స్ ను, కోర్టులను ఆశ్రయించవచ్చుననే వెసులుబాటును కల్పించిన విషయాన్ని నిరసనకారులు గుర్తు చేస్తున్నారు.