wrestlers protest: పంతం వీడనున్న రెజ్లర్లు.? అమిత్‌ షాతో చర్చల్లో తేలిందేంటి.?

తమను లైంగికంగా వేధించిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో గత కొన్ని రోజులుగా రెజర్లర్లు ఆందోళన చేపడుతోన్న విషయం తెలిసిందే. బ్రిజ్‌ భూషన్‌ శిక్షించాలని రెజర్లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు...

wrestlers protest: పంతం వీడనున్న రెజ్లర్లు.? అమిత్‌ షాతో చర్చల్లో తేలిందేంటి.?
Wrestlers

Updated on: Jun 05, 2023 | 12:52 PM

తమను లైంగికంగా వేధించిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో గత కొన్ని రోజులుగా రెజర్లర్లు ఆందోళన చేపడుతోన్న విషయం తెలిసిందే. బ్రిజ్‌ భూషన్‌ శిక్షించాలని రెజర్లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు రెజ్లర్లు శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఆయన ఇంట్లో కలిశారు. ఈ భేటీలో బజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌, వినేష్‌ ఫోగట్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ భేటీలో భాగంగా రెజ్లర్లు తమ ఆందోళనను హోంమంత్రితో పంచుకున్నారని సమాచారం. బ్రిజ్‌ భూషణ్‌పై త్వరిగతిన ఛార్జ్‌షీట్‌ దాఖలయ్యేలా చూడాలని రెజ్లర్లు మంత్రిని కోరినట్లు సమాచారం.

ఈ సమావేశం దాదాపు రెండు గంటలు జరిగినట్లు సమాచారం. రెజ్లర్లు చేసిన డిమాండ్‌పై అమిత్‌ షా స్పందిస్తూ.. చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టాన్ని తన పని తాను చేయనివ్వండని చెప్పినట్లు తెలుస్తోంది. అమిత్‌ షాతో జరిగిన భేటీ అంశాలపై రెజ్లర్లు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. భేటీ అయినట్లు బజ్‌రంగ్ ఫునియా మీడియాకు తెలిపారు. అయితే ప్రస్తుతానికి అంతకంటే తానేమీ చెప్పలేనని తెలిపారు.

మరి అమిత్‌ షాతో భేటీ తర్వాత రెజ్లర్ల ఆలోచనలో మార్పు వస్తుందా.? పంతం వీడుతారా.? అన్నది చూడాలి. ఇదిలా ఉంటే బ్రిజ్‌ భూషన్‌ను శిక్షించాలంటూ గత ఏప్రిల్‌లో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద రెజ్లర్లు చేపట్టిన బజరంగ్, సాక్షి, వినేష్ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని పతకాలను గంగా నదిలో వేయడానికి రెజ్లర్లు హరిద్వార్‌ వెళ్లారు. అయితే రైతు నాయకులు సద్ది చెప్పడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..