Priyanka Gandhi: బోటు నడిపే వ్యక్తికి ధన్యవాదాలు తెలిపిన ప్రియాంకా గాంధీ.. ఎందుకంటే..?

|

Feb 14, 2021 | 8:12 PM

Priyanka Gandhi: నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే నాయకులు ఒక్కోసారి విశ్రాంతి కోసం విహారయాత్రలకు వెళ్లడం సహజం.

Priyanka Gandhi: బోటు నడిపే వ్యక్తికి ధన్యవాదాలు తెలిపిన ప్రియాంకా గాంధీ.. ఎందుకంటే..?
Follow us on

Priyanka Gandhi: నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే నాయకులు ఒక్కోసారి విశ్రాంతి కోసం విహారయాత్రలకు వెళ్లడం సహజం. కొందరు నాయకులు విదేశాలకు వెళితే.. మరికొందరు స్థానికంగా ఉన్న ఆలయాలను, ఇతర ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఆ సందర్భంగా దొరికిన కొద్దిపాటి సమయంలోనే వారు ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. తాజాగా కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్ర కుటుంబ సమేతంగా ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించారు. ఆ సందర్భంగా ఆమె గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయితే, గంగానదిలో స్నానమాచరించడానికి ముందు.. ప్రియాంక గాంధీ, ఆమె కుటుంబ సభ్యులు గంగానదిలో పడవ ప్రయాణం చేశారు. ఇందులో వింతేముంది అనుకుంటారా? అయితే, ఆ పడవను ప్రియాంక గాంధీనే స్వయంగా నడిపారు. దానికి సంబంధించిన వీడియోను ప్రియాంక గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘తరంగాలకు భయపడితే.. పడవ నది దాటదు. అలాగే ప్రయత్నించే వారు కూడా ఓడిపోరు’ అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ పెట్టారు. అలాగే.. బోటు నడపడం చాలా సంతోషంగా ఉందన్న ప్రియాంకా గాంధీ.. బోటు నడిపే వ్యక్తి సుజీత్ నిషద్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Priyanka Gandhi Tweet:

Also read:

FASTag: ఇంకా ఫాస్టాగ్ తీసుకోలేదా..? అయితే అలెర్ట్ అవ్వండి… ఎందుకంటే రేపటి నుంచి..

Akira Nandan Latest Pic: పవన్ తనయుడు లేటెస్ట్ ఫోటో.. రాబోయే కాలానికి కాబోయే హీరో అంటున్న ఫ్యాన్స్