UP Lakhimpur Kheri Violence Updates: ఉత్తరప్రదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లఖీంపూర్ ఖేరీని సందర్శించడానికి గృహ నిర్బంధాన్ని దాటుకోని వెళ్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. హరగావ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. లక్నోలోని తన ఇంటినుంచి ప్రియాంక లఖింపూర్ ఖేరీకి తెల్లవారుజామున బయలు దేరారు. ఈ క్రమంలో పోలీసులు ప్రియాంక గాంధీని అడుగడుగునా అడ్డుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదని పోలీసుల వెల్లడించారు. దీంతో ప్రియాంక గాంధీ బాధితులను కలిసేందుకు కాలినడకన బయలుదేరగా.. లఖింపూర్ ఖేరికి వెళ్లే మార్గంలో హరగావ్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
తాను ఇంటి నుంచి బయటకు రావడం నేరం కాదంటూ ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితులను కలిసి వారి బాధను పంచుకోవాలనుకుంటున్నానని ప్రియాంక వెల్లడించారు. తాను ఏదైనా తప్పు చేసి ఉంటే ఆర్డర్ చూపించి కారు ఆపాలంటూ ప్రియాంక కోరారు. తాను బాధిత కుటుంబాలను ఓదార్చడానికి వెళ్తున్నానని, ఇదేమీ నేరం కాదంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దేశం రైతులదని, బీజేపీది కాదంటూ ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా.. ప్రియాంక గాంధీ లఖింపూర్ సందర్శించేందుకు ఆదివారం లక్నో విమానాశ్రయానికి చేరుకుని నేరుగా లక్నోలోని ఆమె నివాసమైన కౌల్ హౌస్‌కు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకుని గృహ నిర్బంధంలో ఉంచగా.. ఆమె అక్కడినుంచి తెల్లవారుజామున లఖింపూర్‌కు బయలు దేరారు.
श्रीमती @priyankagandhi जी को हरगांव से गिरफ्तार करके सीतापुर पुलिस लाइन ले जाया जा रहा हूं, कृपया सभी लोग पहुंचे। pic.twitter.com/d0GClYamvr
— UP Congress (@INCUttarPradesh) October 3, 2021
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీ జిల్లాలోని టికునియాలో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై కేంద్రమంత్రి కాన్వాయ్ దూసుకెళ్లడంతో.. నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ రోజు ప్రతిపక్షాలు సహా.. రైతు సంఘాల నేతలు ఈ ప్రాంతానికి వెళ్లనున్నట్లు వెల్లడించడంతో లఖీమ్‌పూర్ ఖేరీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు యూపీ పోలీసులు 144 సెక్షన్ విధించారు.
Also Read: