Priyanka Gandhi Boat Journey: ‘హైలో హైలెస్సా హంస కదా నా పడవ’, బోటెక్కి తెడ్లు వేసిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మౌనీ అమావాస్యరోజున యూపీలో..గంగా, యమునా, సరస్వతీ నదులు మూడూ కలిసే సంగమం వద్ద పవిత్ర స్నానం చేసి, ప్రత్యేక పూజలు కూడా చేశారు

Priyanka Gandhi Boat Journey: హైలో హైలెస్సా హంస కదా నా పడవ, బోటెక్కి తెడ్లు వేసిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ

Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 21, 2021 | 11:56 AM

Priyanka Gandhi Boat Journey:  కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మౌనీ అమావాస్యరోజున యూపీలో..గంగా, యమునా, సరస్వతీ నదులు మూడూ కలిసే సంగమం వద్ద పవిత్ర స్నానం చేసి, ప్రత్యేక పూజలు కూడా చేశారు. అక్కడ ఆమె సుజిత్ నిషాద్ అనే మత్స్య కారుడి బోటులో ఆమె ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె రిలీజ్ చేశారు. స్థానిక పోలీసులు తమను వేధిస్తున్నారని, తమ బోట్లను నాశనం చేస్తున్నారని ఈ సందర్భంగా సుజిత్ ఆమెకు తెలిపి బావురుమన్నాడు. మీరు ఏదో విధంగా తమను ఆదుకోవాలని ఆయన కోరడంతో ప్రియాంక ఇందుకు అంగీకరించారు. ఆదివారం ఆమె యూపీలోని ఈ ప్రాంతానికి వఛ్చి వందలాది మత్స్య కారులను, బోట్లపై ఆధారపడి జీవిస్తున్న ఇతరులను కలుసుకోనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా  నది నుంచి ఇసుక తవ్వకాలకోసం పడవలను వినియోగించుకోవడాన్ని యూపీ ప్రభుత్వం 2019 లోనే నిషేధించింది. దీంతో నిషాద్ వర్గ మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోయింది. అప్పటి నుంచి వారు   తమకు ఏదో ఒక ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రియాంక నేడు ప్రయాగ్ రాజ్ సందర్శించి అక్కడి నుంచి బాన్స్ వార్ గ్రామాన్ని చేరుకుంటారని, మత్స్యకారులను కలుసుకుని వారి బాగోగులు తెలుసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

 

Tirumala Tirupati News: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇకపై గ్రీన్​ మంత్రా లడ్డూ బ్యాగులు.. వివరాలు ఇవి

Kareena Kapoor second baby : పండంటి బిడ్డకు జన్మనించిన బాలీవుడ్ బ్యూటీ.. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ జంటకు పాప..