ఉత్తరప్రదేశ్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలను ఉధృతం చేశారు కాంగ్రెస్ పార్టీ కీలకనేత ప్రియాంకాగాంధీ. మథురలో కాంగ్రెస్ నిర్వహించిన కిసాన్ పంచాయత్‌కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె, బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులంటే ప్రధాని మోదీకి చాలా ద్వేషమని విమర్శించారు. దేశాన్ని అమ్మేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం తప్ప ఇంకేమి లేదని ఆరోపించారు ప్రియాంక. ఎల్‌ఐసీ, బీపీసీఎల్ లాంటి సంస్థలను కేంద్రం అమ్మేస్తోంది.. అవకాశం వస్తే బీజేపీ గోవర్ధనగిరి పర్వతాన్ని కూడా అమ్మేస్తుందని ఘాటుగా విమర్శించారు ప్రియాంకగాంధీ.
Read also :