ఎకానమీ సెషన్… రుణ పరిపతి పెంపునకు కృషి… వడ్డీ తగ్గింపుతో ఆర్థిక వృద్ధికి ఊతం… నీతి ఆయోగ్ చైర్మన్

దేశంలోని ప్రైవేటు సంస్థలు వడ్డీ రేట్లను తగ్గిస్తే అది ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని నీతి ఆయోగ్ చైర్మన్ అమితబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. గ్లోబల్ అలయెన్స్ ఫర్ మాస్ ఎంటర్‌ప్రిన్యూర్ నిర్వహించిన వర్చువల్ మీట్‌లో పాల్గొని మాట్లాడారు.

ఎకానమీ సెషన్... రుణ పరిపతి పెంపునకు కృషి... వడ్డీ తగ్గింపుతో ఆర్థిక వృద్ధికి ఊతం... నీతి ఆయోగ్ చైర్మన్
Follow us

| Edited By:

Updated on: Dec 13, 2020 | 8:06 PM

దేశంలోని ప్రైవేటు సంస్థలు వడ్డీ రేట్లను తగ్గిస్తే అది ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని నీతి ఆయోగ్ చైర్మన్ అమితబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. గ్లోబల్ అలయెన్స్ ఫర్ మాస్ ఎంటర్‌ప్రిన్యూర్ నిర్వహించిన వర్చువల్ మీట్‌లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం సైతం రుణాల పరపతిని పెంచేందుకు, రుణాలపై వడ్డీ రేటును తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. చైనా, సౌత్ కొరియా, వియత్నాం దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.

దేశ వృద్ధిలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకం….

రానున్న రోజుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాత్ర దేశాభివృద్ధిలో కీలకం కానుందని కాంత్ అభిప్రాయపడ్డారు. అయితే ఎంఎస్ఎమ్ఈలకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేయాల్సి ఉందని, ఆ దిశగా కేంద్రం క‌ృషి చేస్తోందని, ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా 2 లక్షల కోట్ల రుణాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా ఎంఎస్ఎంఈల బలోపేతానికి కేంద్రం కృషి చేస్తోందని అన్నారు.