త్రివిధ దళాల అధిపతులతో రేపు ప్రధాని భేటీ.. అగ్నిపత్ ఆందోళనలతో ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం

|

Jun 20, 2022 | 9:33 PM

అగ్నిపథ్(Agnipath) పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ రేపు (జూన్ 21) త్రివిధ దళాల అధిపతులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు త్రివిధ దళాల అధిపతులు ప్రత్యేకంగా ప్రధానితో...

త్రివిధ దళాల అధిపతులతో రేపు ప్రధాని భేటీ.. అగ్నిపత్ ఆందోళనలతో ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం
Pm Modi
Follow us on

అగ్నిపథ్(Agnipath) పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ రేపు (జూన్ 21) త్రివిధ దళాల అధిపతులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు త్రివిధ దళాల అధిపతులు ప్రత్యేకంగా ప్రధానితో భేటీ(PM Modi) కానున్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ముందుగా ప్రధాని మోదీని కలుస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్మీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తుదారుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్లకు ప్రత్యేక ర్యాంక్‌ను కేటాయిస్తారని, ఇది ప్రస్తుతం ఉన్న ఇతర ర్యాంక్‌ల కంటే భిన్నంగా ఉంటుందని ఉన్నత వర్గాలు వెల్లడించాయి. నాలుగు సంవత్సరాలు సర్వీసు చేసిన వారు.. సేవా సమయంలో పొందిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకుండా చర్యలు తీసుకంటారు. ఎన్‌రోల్ చేసే ముందు పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించబడుతుందని మిలటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి వెల్లడించారు.

మరోవైపు.. త్రివిధ దళాల్లో సైనిక నియామకం కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు. అగ్నిపథ్ ద్వారా మంచే జరుగుతుందన్న కేంద్రమంత్రి.. కాంగ్రెస్ హయాంలోనే 1999లో అగ్నిపథ్ కు బీజం పడిందని వెల్లడించారు. అగ్నివీర్ లో ఒకసారి పని చేస్తే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. సైన్యంలో పనిచేయాలన్న ఆశతో చాలా మంది యువత ఉన్నారని.. వారందరూ అగ్నిపథ్ లో చేరొచ్చని వెల్లడించారు. సర్వీస్ నుంచి వచ్చాక అగ్నివీరులకు అనేక విద్య , ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయని వివరించారు. ప్రతి ఒక్కరు అగ్నిపథ్ పథకానికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి