Rajasthan Election Results 2023: రాజస్థాన్‌ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. ఫలించిన ప్రధాని మోదీ సుడిగాలి ప్రచారం

|

Dec 03, 2023 | 10:01 PM

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ మ్యాజిక్‌ మళ్లీ గెలిపించింది. అమిత్‌షా మంత్రాంగం భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిపెట్టింది. మోదీ సుడిగాలి ప్రచారం బీజేపీకి ప్లస్‌పాయింట్‌ అయ్యింది.

Rajasthan Election Results 2023: రాజస్థాన్‌ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. ఫలించిన ప్రధాని మోదీ సుడిగాలి ప్రచారం
Pm Modi
Follow us on

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ మ్యాజిక్‌ మళ్లీ గెలిపించింది. అమిత్‌షా మంత్రాంగం భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిపెట్టింది. మోదీ సుడిగాలి ప్రచారం బీజేపీకి ప్లస్‌పాయింట్‌ అయ్యింది.

రాజస్థాన్‌ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉంది. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి ప్రచారం చూశారు. బీజేపీ స్టార్‌ క్యాంపెనర్‌గా మోదీ సక్సెస్‌ అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. హిందుత్వ కార్డును సక్సెస్‌ఫుల్‌గా వాడారు.

200 స్థానాలు ఉన్న రాజస్థాన్‌లో ఒక్క ముస్లింకు కూడా బీజేపీ టిక్కెట్‌ ఇవ్వలేదు. అంతేకాకుండా ముస్లిం ప్రాబల్యం ఉన్న మూడు స్థానాల్లో ముగ్గురు సాధువులను రంగంలోకి దింపి విజయం సాధించింది. రాజస్థాన్‌లో పేపర్‌లీక్‌ వ్యవహారం అశోక్‌ గెహ్లాట్‌ సర్కార్‌ పతనానికి దారితీసింది. అంతేకాకుండా ప్రభుత్వం అవినీతిని పదేపదే ప్రస్తావించారు మోదీ. రెడ్‌డైరీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చిట్టా ఉందన్నారు.

వాస్తవానికి గత 25 ఏళ్ల నుంచి రాజస్థాన్‌లో ప్రతి ఎన్నికల్లో కూడా అధికార మార్పిడి జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. రాజస్థాన్‌ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లలో ఘనవిజయం సాధించింది. 70 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. అంతేకాకుండా 14 మంది ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. వీరిలో ఎక్కువ మంది బీజేపీ రెబల్స్‌ ఉన్నారు.

అయితే రాజస్థాన్‌లో బీజేపీ నుంచి సీఎం ఎవరు అవుతారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. మాజీ సీఎం వసుంధరా రాజేకు మరోసారి అవకాశం దక్కుతుందా? లేక దియాకుమారికి ఛాన్స్‌ ఇస్తారా? అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఆ పార్టీ కొంపముంచాయని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు.

మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయాన్ని హ్యాట్రిక్‌ అని అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ హ్యాట్రిక్‌ అనేది 2024 లోక్‌సభ ఎన్నికల్లో కొట్టబోయే హ్యాట్రిక్‌కు గ్యారంటీ ఇచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల విజయం, ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని చెప్పారు. అభివృద్ధిని ఎగతాళి చేసేవారికి ఈ ఎన్నికల విజయం మంచి సందేశం ఇచ్చిందని ప్రధాని మోదీ విజయోత్సవ సభలో అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…