PM Modi: ఆరోగ్యం నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు.. ఈ ధాన్యాలు మీ అదృష్టాన్ని మారుస్తాయి.. వీటిని తినాలంటూ ఎంపీలకు ప్రధాని మోదీ సూచన..

|

Dec 20, 2022 | 6:12 PM

తృణ ధాన్యాలు తినాలని అనేక సందర్భాల్లో ప్రధాని మోదీ దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్‌గా ప్రకటించింది. తృణ ధాన్యం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఆరోగ్యం నుంచి వ్యవసాయం, దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి...

PM Modi: ఆరోగ్యం నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు.. ఈ ధాన్యాలు మీ అదృష్టాన్ని మారుస్తాయి.. వీటిని తినాలంటూ ఎంపీలకు ప్రధాని మోదీ సూచన..
PM Modi Suggest MP to Adopt Coarse grain
Follow us on

పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలు మిల్లెట్లు తినాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ . దీనిని ప్రజాఉద్యమంలా చేసి ప్రజలను చైతన్య పరచాలని ఎంపీలను కోరారు. భారత ప్రభుత్వం గత కొంతకాలంగా తృణ ధాన్యాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోందన్నారు. ప్రధాని మోదీ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్‌గా ప్రకటించింది. ఇదొక్కటే కాదు, G-20 అధ్యక్ష పదవిని భారతదేశం పొందిన తరువాత.. శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన కార్యక్రమాలలో తృణ ధాన్యాలను అందించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

అధిక పోషకాలు కలిగిన మిల్లెట్స్‌కు యోగా అంత పేరు రావాలన్నారు ప్రధాని మోదీ. పార్లమెంట్‌లో ఎంపీలకు మిల్లెట్స్‌ లంచ్‌ను ఏర్పాటు చేశారు. 2023 అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం కావడంతో, ఎంపీలు అందరికీ ప్రత్యేకంగా మిల్లెట్స్ లంచ్ ను కేంద్ర వ్యవసాయ మంత్రి ఏర్పాటు చేశారు. ఎంపీలకు మిల్లెట్స్ లంచ్ లో భాగంగా రాగి, జోవార్ (జొన్న), బజ్రా తదితర మిల్లెట్స్ పదార్థాలను వడ్డించారు. ప్రధాని మోదీ రాగి , జొన్న వంటకాలను ఆరగించారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ , విపక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే కూడా ఈ విందుకు హాజరయ్యారు.

తృణ ధాన్యం అంటే ఏంటో తెలుసుకోండి..

అది ఆరోగ్యం నుంచి వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థకు ఎంత మార్పు తీసుకురాగలదో తెలుసుకోండి… గుండె జబ్బుల నుండి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో జోవర్, బజ్రా, రాగి, బార్లీ, కోడో, సామ, బజ్రా, సావా, కుట్కి, కంగ్నీ, చీనా వంటి తృణధాన్యాలు తృణ ధాన్యాల వర్గంలోకి వస్తాయి. WebMD నివేదిక ప్రకారం , తృణధాన్యాలు ఊబకాయం, గుండె జబ్బులు, టైప్-2 మధుమేహం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది పేగుల ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచే బాక్టీరియాల సంఖ్యను శరీరంలో పెంచుతుంది. దీనికి ప్రధాన కారణం ఫైబర్, పోషకాలు. బియ్యం, ముతక ధాన్యాలతో పోలిస్తే, వాటిలో చాలా రెట్లు ఎక్కువ పోషకాలు కనిపిస్తాయి. తృణ ధాన్యాలను సూపర్ ఫుడ్ అని కూడా పిలవడానికి కారణం ఇదే. ఫైబర్, విటమిన్-బి, ఫోలేట్, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఐరన్, అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు మాత్రమే ముతక ధాన్యాలలో లభిస్తాయి.

ఆర్థిక వ్యవస్థ ఊతం..

తృణ ధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచంలోని ముతక ధాన్యాలలో భారతదేశం 41 శాతం వరకు వాటా కలిగి ఉంది. DGCIS డేటా ప్రకారం, 2021-22 సంవత్సరంలో, భారతదేశం తృణ ధాన్యాల ఎగుమతిలో 8.02 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఈ సంవత్సరం భారతదేశం 159,332.16 MT తృణ ధాన్యాలను ఎగుమతి చేసింది. గత సంవత్సరం ఈ సంఖ్య 147,501.08 MT. భారతదేశం ప్రపంచంలోని అనేక దేశాలకు తృణ ధాన్యాలను ఎగుమతి చేస్తుంది. ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్, సౌదీ అరేబియా, లిబియా, ఒమన్, ఈజిప్ట్, ట్యునీషియా, యెమెన్, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. తృణ తృణధాన్యాలలో.. భారతదేశం అత్యధికంగా మిల్లెట్లు, రాగులు, కానేరి, జొన్నలు, బుక్వీట్లను ఎగుమతి చేస్తుంది. ఏటా పెరుగుతున్న ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపునిస్తాయి.

పార్లమెంటు లంచ్ మెనూలో మిల్లెట్..

రసాయన రహిత వ్యవసాయం, పర్యావరణానికి ప్రయోజనాలు..

అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేసే తృణధాన్యాల సాగు కోసం రైతులు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. వరితో పోలిస్తేతృణ ధాన్యాల సాగులో నీటి వినియోగం తక్కువ. దీని సాగులో యూరియా, ఇతర రసాయనాల అవసరం లేదు. ఈ విధంగా దీని సాగు పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. ముతక ధాన్యాల ఉత్పత్తి విదేశాలలో వారి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం