Prime Minister Narendra Modi: భారతదేశ అభ్యున్నతి కోసం సాక్షాత్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీతో మీ ఆలోచనలు, సమస్యలు చెప్పాలనుకుంటున్నారా? అయితే, ఈ నెలలో, మన్ కీ బాత్ కార్యక్రమం 24 న జరుగుతుంది. ‘ఈ నెల మన్ కీ బాత్ కార్యక్రమం కోసం మీ ఆలోచనలను నాతో పంచుకోవాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. నమో యాప్ ద్వారా, @mygovindia కు మెయిల్ పంపించడం ద్వారా లేదా, 1800-11-7800 ఫోన్ నెంబర్ కు డయల్ చేసి మీ సందేశాన్ని రికార్డ్ చేయొచ్చు” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ముఖంగా కొంచెం సేపటి క్రితం దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతీ నెలా మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలు, సమస్యలు, సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుంటూ ముందుకు సాగుతోన్న సంగతి తెలిసిందే.
ఒక సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ప్రధాని మోదీ.. ఎలాంటి రాజకీయ, వంశపారపర్య లేదా ప్రత్యేకంగా కులాల మద్దతు లేదనప్పటికీ ప్రజా సేవలో అగ్రస్థానాన్ని అందుకోవడం విశేషం. ఎలాంటి వంశపారంపర్యం లేనప్పటికీ కేవలం ప్రజల మద్దతుతో వాళ్ల ఆశీర్వాదంతో 2001 నుంచి గుజరాత్‌కు సేవ చేసే అవకాశం మోదీకి దక్కింది. ఆ ఆశీర్వాదాలు బలంగా ఉండడం వల్లే 20 ఏళ్లైనా దేశ సేవలో కొనసాగుతున్నా అని మోదీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.
గుజరాత్ సీఎం నుంచి ప్రస్తుతం దేశ ప్రధానిగా సేవ చేసే అవకాశాన్ని దేశ ప్రజలు నరేంద్ర మోదీకి కల్పించారు. కరోనా మహమ్మారితో అతలాకుతలమైన దేశ ఆర్థిక వ్యవస్థ అనతికాలంలోనే పుంజుకుని వేగంగా కోలుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. “కరోనా మహమ్మారి వంటి క్లిష్ట దశ అనంతరం.. భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా కోలుకుంది. దీనితో ప్రపంచమంతా భారత్ వైపు ఆశగా చూస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతోందని అంతర్జాతీయ సంస్థలు ఇటీవల పేర్కొన్నాయి.” అని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
ప్రస్తుత భారతదేశ ఆర్థిక సంవత్సరంలో భారత్ 9.5 శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. మహమ్మారి వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలు, సరఫరా అంతరాయాలు, ధరల పెరుగుదల ఒత్తిడి వంటి అంశాలను మోదీ తరచూ ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలబడింది.
సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్న సర్దార్ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతో ఉందంటున్నారు ప్రధాని మోదీ. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు తోడ్పడేందుకు గుజరాత్‌లోని సూరత్‌లో సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ నిర్మిస్తున్న హాస్టల్‌కు భూమిపూజ చేశారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా విద్యార్థుల బంగారు కలలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అభివృద్ధికి వర్గాలు, కులాలు అడ్డంకులు కాకూడదన్న సర్దార్ పటేల్ మాటలను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఈ సందర్భంగా మోదీ సూచిస్తున్నారు.
This month, the #MannKiBaat programme will take place on the 24th. I invite you all to share your ideas for this month’s episode. Write on the NaMo App, @mygovindia or dial 1800-11-7800 to record your message. https://t.co/QjCz2bvaKg
— Narendra Modi (@narendramodi) October 16, 2021
Read also: Rain warnings: అల్పపీడనం కారణంగా ఆకాశం మేఘావృతం, రాత్రి నుండి చిరుజల్లులు,హెచ్చరికలు