Sirivennela Sitarama Sastri: ఆయన మరణం నన్నెంతగానో బాధించింది.. సిరివెన్నెల మృతిపై స్పందించిన ప్రధాని మోడీ..

|

Nov 30, 2021 | 7:57 PM

సిరివెన్నెల మృతిపై తీవ్ర సంతాపం తెలిపారు ప్రధాని మోడీ. అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది.

Sirivennela Sitarama Sastri: ఆయన మరణం నన్నెంతగానో బాధించింది.. సిరివెన్నెల మృతిపై స్పందించిన ప్రధాని మోడీ..
Pm Modi On Sirivennela Sita
Follow us on

సిరివెన్నెల మృతిపై తీవ్ర సంతాపం తెలిపారు ప్రధాని మోడీ. అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి.. అంటూ ట్వీట్‌ చేశారు ప్రధాని మోడీ.

సిరివెన్నెల చివరి సారిగా మాట్లాడిన మాటలు..

సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరి సారిగా మాట్లాడిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. డైరెక్టర్ కూచిపూడి వెంకట్‌తో చివరకి సారిగా ఫోన్‌లో మాట్లాడారు. మణికొండలో కూతురు ఇంట్లో ఉన్నట్టు చెప్పారు. వాసు సనిమా రాయాల్సి ఉంది.. కానీ రెండు నెలలు రాయలేనన్నారు.

డిశంబర్ నెల అంతా పోస్ట్ ఆపరేషన్ రెస్ట్‌లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. మళ్లీ ఆరోగ్యంగా తిరిగొస్తాననే నమ్మకం కావొచ్చు.. తన ఆరోగ్య పరిస్థితిపై నవ్వుతూ సరదాగానే మాట్లాడారు. కానీ అంతలోనే ఆయన వెన్నెలలో కలిసిపోయారు.

ఇవి కూడా చదవండి: Sirivennela Sitarama Sastri: జగమంత కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాది అంటూ గగనానికి సిరివెన్నెల..

Green Peas Benefits: బఠానీలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..