Independence Day 2023: పొందూరు చేనేత కార్మికులకు ఎర్రకొట సాక్షిగా అరుదైన గౌరవం.. ప్రధాని మోదీతో..

| Edited By: Sanjay Kasula

Aug 15, 2023 | 3:47 PM

అందరిని మెరిపించే అసలు సిసలు అందాల ఇంద్రధనసులు అవి. ఆ ప్రత్యేకతలే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీ కార్మికులను ఢిల్లీకి తీసుకెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో చారిత్రిక ఎర్రకోటలో జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రేత్యక ఆహ్వానితులుగా పాల్గొనేలా చేసింది. కేంద్ర ప్రభుత్వం 'జన్ భాగీదారి' దార్శనికతకు అనుగుణంగా దేశంలోని..

Independence Day 2023: పొందూరు చేనేత కార్మికులకు ఎర్రకొట సాక్షిగా అరుదైన గౌరవం.. ప్రధాని మోదీతో..
Pm Modi Greets Ponduru Khadi Workers
Follow us on

ఢిల్లీ, ఆగస్టు 15: ఎన్నో వస్త్ర విశేషాల ప్రత్యేకతలు పొందూరు ఖాదీ సొంతం. ప్రత్యేకించి పరిచయం అవసరం లేని మధురానుభూతులు పొందూరు చేనేత. అందరిని మెరిపించే అసలు సిసలు అందాల ఇంద్రధనసులు అవి. ఆ ప్రత్యేకతలే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీ కార్మికులను ఢిల్లీకి తీసుకెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో చారిత్రిక ఎర్రకోటలో జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రేత్యక ఆహ్వానితులుగా పాల్గొనేలా చేసింది. కేంద్ర ప్రభుత్వం ‘జన్ భాగీదారి’ దార్శనికతకు అనుగుణంగా దేశంలోని ప్రతి వర్గం ప్రజలకు ఎర్రకోటలోని వేడుకల్లో పాల్గొనే అవకాశ కల్పించింది.

ప్రత్యేక ఆహ్వానితుల సమక్షంలో ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా  దేశవ్యాప్తంగా 50 మంది ఖాదీ నేతకలాకారులకు స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానం పంపింది కేంద్ర ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పొందూరు పట్టణానికి చెందిన ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం తరుపున నేతన్న బల్ల భద్రయ్య అతని సతీమణి బల్ల లక్ష్మీ, వీవర్ జల్లేపల్లి కాంతమ్మ లకు ఈ అరుదైన గౌరవం దక్కింది.

ఆగస్టు 15న తన భార్య బల్ల లక్ష్మితో కలిసి భద్రయ్య, జల్లేపల్లి కాంతమ్మ తమ కుటుంబ సభ్యులతో ప్రత్యేక అతిథి హెూదాలో చారిత్రాత్మక ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు.

ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీతో..

పతాకావిష్కరణ అనంతరం ఎర్రకోటలో ప్రత్యేక అహ్వానితులకు ఏర్పాటు చేసిన గేలరి వద్దకు వచ్చిన ప్రధాని మోదీ.. పలువురు ఆహ్వానితులను కలుసుకున్నారు.. కొందరితో స్వయంగా మాట్లాడారు. ఆ సందర్భంలోనే ముందు వరుసలో ఉన్న పొందూరు పట్టణానికి చెందిన వీవర్ జల్లేపల్లి కాంతమ్మకు అభివాదం చేస్తూ ఆమెతో కాసేపు ముచ్చటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడమే కాకుండా ప్రధాని మోదీని కలిసే అవకాశం కూడా రావడంతో వేడుకల్లో పాల్గొన్న కాంతమ్మ, భద్రయ్య, లక్ష్మి ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు.

సామాన్యులైన పొందూరు ఖాదీ కార్మికులకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించినందుకు కేంద్రప్రభుత్వానికి పొందూరు ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం ప్రతినిధులు, సిబ్బంది, పొందూరు చేనేత కళాకారులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మహాత్మా గాంధీని సైతం అబ్బుర పరిచిన పొందూరు ఖాదీ…

మహాత్మా గాంధీ నుంచి ప్రస్తుత రాజకీయ నాయకులు వరకు పొందూరు ఖాదీకి ఎంతో మంది అభిమానులే.. గాంధీ పిలుపు మేరకు విదేశీ వస్తు బహిష్కరణ, విదేశీ వస్త్రదహనాలతో జాతీయోద్యమం పతాక స్థాయికి చేరుకొని ఖాదీ స్వదేశీ ఉద్యమంగా రూపుదిద్దుకొన్న సమయం అది.. అప్పటికే ఆంధ్రప్రాంతంలో వాడుకలో ఉన్న సన్న నూలు వస్త్రం గాంధీజీ దృష్టిని ఆకర్శించింది. ఆ నేత నాణ్యత గురించి తెలుసుకొని రమ్మని గాంధీజీ తన కుమారుడిని పొందూరు పంపించారట. ఆతరువాత కుమారుడు ఇచ్చిన నివేదిక ద్వారా పొందూరులో తయారయ్యే సన్న ఖాధీ శ్రేష్టతకి.. నాణ్యతకి, కార్మికుల నైపుణ్యానికి గాంధీజీ అబ్బురపడ్డారు.

పొందూరు ఖాధీ కళావైభవాన్ని ప్రశంసిస్తూ యంగ్ ఇండియా పత్రికలోను గాంధీ ఓ ప్రత్యేక వ్యాసం కూడా రాశారు. మన రాష్ట్రానికి విశిష్ట అతిధిగా వచ్చిన ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పొందూరు ఖద్దర్‌ను అపురూప బహుమతిగా అందించింది. ఇలా సామాన్యులు నుంచి మొదలు అసమాన్యుల వరకు ఎంతోమంది మనసు దోచుకుంది పొందూరు ఖాదీ. అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికల నుంచి అవార్డులు, ప్రసంశల జల్లులు అందుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం