PM Modi: టికెట్ కొనుగోలు చేసి మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోదీ.. నాగ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..

| Edited By: Narender Vaitla

Dec 11, 2022 | 11:26 AM

నాగ్‌పూర్‌లో ఫ్రీడం పార్క్‌ నుంచి ఖాప్రీ వరకు మెట్రోలో ప్రయాణించారు ప్రధాని నరేంద్ర మోదీ. విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ నాగ్‌పూర్ మెట్రోలో ప్రయాణించారు. నాగ్‌పూర్ మెట్రో ఫ్రీడం పార్క్ స్టేషన్‌లో టిక్కెట్లు కొనుగోలు చేసి మరీ ప్రయాణం చేశారు.

PM Modi: టికెట్ కొనుగోలు చేసి మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోదీ.. నాగ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..
PM Modi
Follow us on

మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ మధ్య నడిచే ఆరవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దేశంలో ఇది ఆరవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలు మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ మధ్య నడుస్తుంది. ఆయన వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. అనంతరం నాగ్‌పూర్ మెట్రో మొదటి దశను శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత నాగ్‌పూర్ మెట్రో ఫ్రీడమ్ పార్క్ స్టేషన్‌లో ప్రధాని మోదీ టికెట్ కొనుగోలు చేసి నాగ్‌పూర్‌లో ఫ్రీడమ్‌పార్క్‌ నుంచి ఖాప్రీ వరకు మెట్రో ప్రయాణం చేశారు. నాగ్‌పూర్ మెట్రోలో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

ఇక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్, నాగ్ రివర్ పొల్యూషన్ అబెట్‌మెంట్ ప్రాజెక్ట్‌లకు మోదీ శంకుస్థాపన చేస్తారని, అలాగే సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ రీసెర్చ్, మేనేజ్‌మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హిమోగ్లోబినోపతిని ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది.

 

అనంతరం నాగ్‌పూర్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ. 6700 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేయనున్న రైలు ప్రాజెక్టు ఫేజ్-2కి శంకుస్థాపన చేశారు. నాగ్‌పూర్‌లో జరిగే బహిరంగ కార్యక్రమంలో, సుమారు రూ. 590 కోట్లతో నాగ్‌పూర్ రైల్వే స్టేషన్, రూ. 360 కోట్లతో పునరాభివృద్ధి చేయనున్న అజ్నీ రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేస్తారు.

ఈరోజు నాగ్‌పూర్ చేరుకున్న ప్రధాని అక్కడ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఆయనకు స్వాగతం పలికారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం