PM Modi: సంక్షేమం కోసం చేపట్టిన పనులు రాజకీయంగా మారడం దురదృష్టకరం.. ప్రధాని మోదీ సెన్సేషనల్ కామెంట్స్

|

Jun 19, 2022 | 5:32 PM

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్(Agnipath) పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వస్తున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) స్పందించారు. దేశ పౌరుల సంక్షేమం కోసం చేపట్టిన అనేక పనులు రాజకీయ...

PM Modi: సంక్షేమం కోసం చేపట్టిన పనులు రాజకీయంగా మారడం దురదృష్టకరం.. ప్రధాని మోదీ సెన్సేషనల్ కామెంట్స్
Pm Modi
Follow us on

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్(Agnipath) పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వస్తున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) స్పందించారు. దేశ పౌరుల సంక్షేమం కోసం చేపట్టిన అనేక పనులు రాజకీయ రంగులు పులుముకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి ఉద్దేశ్యంతో చేపట్టిన నిర్ణయాలు, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆక్షేపించారు. ఇలా జరగడం మన దేశ దురదృష్టకరమని అన్నారు. ఢిల్లీ(Delhi) లో నిర్మించిన ‘ప్రగతి మైదాన్‌ సమీకృత రవాణా కారిడార్ ను ప్రధాని ప్రారంభించారు. ప్రతిపక్షాల ఆరోపణలను పట్టించుకోమని, నవ భారతంలో సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాగా.. అగ్నిపథ్ పథకం పేరుతో త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తాజాగా తీసుకురాగా.. దానిపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఉత్తరాదికే పరిమితమయ్యే నిరసనలు దక్షిణాదికీ పాకాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనకారులు తీవ్ర విధ్వంసం కలిగించారు. రైళ్లకు నిప్పంటించి భయానక వాతావరణాన్ని సృష్టించారు. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కు తీసుకుని.. పాత విధానంలో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనేకమంది నేతల ఇళ్లకు సైతం ఈ నిరసన సెగ తగిలింది.

ఈ నేపథ్యంలోనే ఈ పథకంపై సైన్యం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. సైన్యంలో సగటు వయసు తగ్గించేందుకే సంస్కరణలు తీసుకొస్తున్నామని త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎన్నో చర్చలు, సమావేశాలు చేసిన తర్వాతే ఈ నిర్ణయాన్ని వెల్లడించామని చెప్పారు. మరోవైపు.. కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలు గతంలోనూ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి