ప్రధాని మోదీ పంచె కట్టులో యూనిక్ లుక్‌లో మెరిశారు. ఎప్పుడూ కుర్తా, పైజామా, హాఫ్ స్లీవ్ జాకెట్‌లో కనిపించే ప్రధాని మహాబలిపురం పర్యటనలో మాత్రం తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకున్నారు. శోర్ ఆలయ ప్రాంగణంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు తమిళ సంప్రదాయ వస్త్రధారణలో స్వాగతం పలికారు. ఇక జిన్‌పింగ్ కూడా పార్మల్ షర్ట్, ప్యాంట్‌తో చాలా సింపుల్‌గా కనిపించారు. అనంతరం మహాబలిపురంలోని షోర్ ఆలయాన్ని జింపింగ్‌కు పరిచయం చేశారు. ఇద్దరు కలిసి యునెస్కో వారసత్వ సంపదైన మహాబలిపురం ఆలయ ప్రాంగణంలో కలియతిరిగారు. ఆలయ విశిష్టత గురించి మోదీ.. జిన్‌పింగ్‌కు వివరించారు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు కూర్చోని మాట్లాడుకున్నారు. ఈ సమయంలో మోదీకి, జిన్‌పింగ్‌కు..అధికారులు కొబ్బరినీళ్లను ఇవ్వగా..వారు సేవించారు.
Tamil Nadu: Prime Minister Narendra Modi receives Chinese President Xi Jinping at Mahabalipuram. pic.twitter.com/8FZ3Z9VvZT
— ANI (@ANI) October 11, 2019
#WATCH Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping visit group of temples at Mahabalipuram. The group of monuments at Mahabalipuram is prescribed by UNESCO as a world heritage site. #TamilNadu pic.twitter.com/Yf8mHXCxh5
— ANI (@ANI) October 11, 2019
Mahabalipuram: PM Narendra Modi with Chinese President Xi Jinping at the round boulder known as Krishna’s Butter Ball. pic.twitter.com/Jr0TxTXINp
— ANI (@ANI) October 11, 2019