Azadi Ka Amrit Mahotsav: స్వాతంత్య సమరయోధుల ఆశయాలను నెరవేర్చుదాం.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు..!

|

Dec 23, 2021 | 8:49 AM

Azadi Ka Amrit Mahotsav: స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నెరవేర్చుదామని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆజాదీ కీ అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల

Azadi Ka Amrit Mahotsav: స్వాతంత్య సమరయోధుల ఆశయాలను నెరవేర్చుదాం.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు..!
Pm Modi
Follow us on

Azadi Ka Amrit Mahotsav: స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నెరవేర్చుదామని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆజాదీ కీ అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల సందర్భంగా దేశంలోని ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు ప్రధాని మోదీ. కేంద్ర హోమంత్రి అమిత్‌షా, రక్షణశాఖ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సహా పలువురు కేంద్రమంత్రులు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కేంద్రం ఆజాదీకీ అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో నిర్వహిస్తోంది. ఉత్సవాల నిర్వహణ కమిటీలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ఇది కమిటీ రెండోసారి సమావేశం. గత మార్చిలో ఈ కమిటీ తొలి సమావేశం జరిగింది. అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15 వరకు జరగనున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్యం.. 75 ఉన్నత లక్ష్యాలు.. 75 ఆకాంక్షలు సాధించాలన్న సంకల్పంతో వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. స్వాతంత్ర్య పోరాటంలో త్యాగాలు చేసిన ప్రముఖులను స్మరించుకుంటూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, నవ భారత నిర్మాణానికి ఆనాటి వీరుల సంకల్పంతో కృషి చేయాలన్నారు ప్రధాని మోదీ. వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఆజాదీ కీ అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలను ప్రధాని ఎంతో ఉన్నతమైన ఆశయంతో నిర్వహిస్తున్నారని ఏపీ సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను తాను వీలైనప్పుడల్లా కలుస్తున్నానని చెప్పుకొచ్చారు.

Also Read:

TTD Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. సర్వదర్శనం టికెట్లు రేపు విడుదల.. వివరాలివే

Andhra Pradesh: ఏపీని వణికిస్తున్న శీతల గాలులు.. వృద్దులు, చిన్నారులు జాగ్రత్త అంటున్న నిపుణులు..

Pro Kabaddi League 2021: నేడు బరిలోకి దిగనున్న ఆరు టీంలు.. హోరాహోరీ పోరులో గెలుపెవరిదో?