PM Modi: అమెరికా, ఈజిప్టు పర్యటనల తర్వాత ఇండియాకి బయలుదేరిన ప్రధాని మోదీ

|

Jun 26, 2023 | 12:14 AM

ప్రధాని మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ పర్యటనలను సక్సెస్‌ఫుల్ గా పూర్తి చేసుకున్న ప్రధాని భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ విషయాన్ని ప్రధాని అధికారిక పీఎంఓ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

PM Modi: అమెరికా, ఈజిప్టు పర్యటనల తర్వాత ఇండియాకి బయలుదేరిన ప్రధాని మోదీ
Pm Modi
Follow us on

ప్రధాని మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ పర్యటనలను సక్సెస్‌ఫుల్ గా పూర్తి చేసుకున్న ప్రధాని భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ విషయాన్ని ప్రధాని అధికారిక పీఎంఓ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. జూన్ 21న అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ.. మూడు రోజుల పాటు అమెరికాలోనే పర్యటించారు. అలాగే శనివారం, ఆదివారం రోజు ఈజిప్టులో పర్యటించారు. అలాగే ఇరు దేశాల సంబంధాలకు సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసితో చర్చలు కూడా జరిగాయి.

ముందుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమైన ప్రధాని కాంగ్రెస్ ఉభయసభ సమావేశంలో ప్రసంగించారు. అలాగే వివిధ సంస్థల సీఈఓ, ఛైర్మన్లను కూడా కలిశారు. ఇండియాలో పెట్టుబడి అవకాశాలకు సంబంధించిన వాటిపై చర్చలు జరిపారు. అనంతరం ఈజిప్టుకు వచ్చిన ఆయన వెయ్యేళ్ల చరిత్ర గలిగిన పురాతన మసీదుకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు ప్రధానికి ఆర్డర్ ఆఫ్ ది నైల్ అనే అవార్డుతో సత్కరించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి