షీలా మృతికి రాష్ట్రపతి, పలువురు ప్రముఖుల సంతాపం

| Edited By:

Jul 20, 2019 | 5:44 PM

ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మార్చి 31 1938లో జన్మించిన ఆమె.. ఢిల్లీకి అత్యధికకాలంగా సీఎంగా పనిచేశారు. 1998 నుంచి 2013 వరకూ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది. ఈమె హయాంలోనే ప్రతిష్టాత్మక కామన్ వెల్త్ గేమ్స్ నడిచాయి. 2014 మార్చి 11న యూపీఏ ప్రభుత్వం ఆమెను కేరళ గవర్నర్‌గా నియమించింది. అయితే ప్రభుత్వం మారి ఎన్డీఏ రావడంతో.. ఆమె అనూహ్యంగా ఆగస్ట్ […]

షీలా మృతికి రాష్ట్రపతి, పలువురు ప్రముఖుల సంతాపం
Follow us on

ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మార్చి 31 1938లో జన్మించిన ఆమె.. ఢిల్లీకి అత్యధికకాలంగా సీఎంగా పనిచేశారు. 1998 నుంచి 2013 వరకూ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది. ఈమె హయాంలోనే ప్రతిష్టాత్మక కామన్ వెల్త్ గేమ్స్ నడిచాయి. 2014 మార్చి 11న యూపీఏ ప్రభుత్వం ఆమెను కేరళ గవర్నర్‌గా నియమించింది. అయితే ప్రభుత్వం మారి ఎన్డీఏ రావడంతో.. ఆమె అనూహ్యంగా ఆగస్ట్ 25న రాజీనామా చేశారు.

షీలా మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలియజేశారు. ఢిల్లీ అభివృద్ధిలో షీలా దీక్షిత్ సేవలు మరువలేనివన్నారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెల్పుతూ ట్వీట్ చేశారు.

ఢిల్లీ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు షీలా దీక్షిత్ మృతిపట్ల ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు, ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు తమ‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఓమ‌ర్ అబ్దుల్లా, ప్రముఖ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ప్రియాంకా గాంధీ, ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ మనోజ్ తివారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ త‌దిత‌రులు సంతాపం తెలిపారు.