Satnam Singh Sandhu: రాజ్యసభకు సత్నామ్ సింగ్ సంధు.. నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము

|

Jan 30, 2024 | 1:48 PM

సత్నామ్ సింగ్ ఎప్పుడూ జాతీయ ఐక్యతను పెంపొందించారని, ఎన్నారైలతో కలిసి పని చేశారని ప్రధాని మోదీ అన్నారు. ఆయన రాజ్యసభకు నామినేట్‌ కావడం తాను శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే రాజ్యసభ కార్యకలాపాలు ఆయన అభిప్రాయాలతో సుసంపన్నం అవుతాయని విశ్వసిస్తున్నానని మోదీ అన్నారు. సత్నామ్ సింగ్ సంధు 2001లో మొహాలిలోని లాండ్రాన్‌లో చండీగఢ్..

Satnam Singh Sandhu: రాజ్యసభకు సత్నామ్ సింగ్ సంధు.. నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము
PM Modi - Satnam Singh Sandhu
Follow us on

ఛండీఘడ్ యూనివర్శిటీ ఛాన్సలర్ సత్నామ్ సింగ్ సంధును రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. సత్నామ్ సింగ్‌ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్టుగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ సోషల్ మీడియాలో ట్వీట్‌ చేశారు. సంధును రాజ్యసభకు నామినేట్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. సత్నామ్ సింగ్ ప్రఖ్యాత విద్యావేత్త, సామాజిక సేవకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అతను అట్టడుగు స్థాయి ప్రజలకు వివిధ మార్గాల్లో సేవ మార్గంలో ఉన్నారు.

సత్నామ్ సింగ్ ఎప్పుడూ జాతీయ ఐక్యతను పెంపొందించారని, ఎన్నారైలతో కలిసి పని చేశారని ప్రధాని మోదీ అన్నారు. ఆయన రాజ్యసభకు నామినేట్‌ కావడం తాను శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే రాజ్యసభ కార్యకలాపాలు ఆయన అభిప్రాయాలతో సుసంపన్నం అవుతాయని విశ్వసిస్తున్నానని మోదీ అన్నారు.

ఇవి కూడా చదవండి

సత్నామ్ సింగ్ సంధు 2001లో మొహాలిలోని లాండ్రాన్‌లో చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ (CGC)కి పునాది వేశారు. దీని తరువాత 2012 సంవత్సరంలో అతను చండీగఢ్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాడు. కానీ చండీగఢ్ యూనివర్శిటీ ఛాన్సలర్ సంధూ లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆర్థిక సహాయం చేస్తున్నారు.

అతను తన రెండు NGOలు ‘ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్’, న్యూ ఇండియా డెవలప్‌మెంట్ (NID) ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడానికి, అలాగే మత సామరస్యాన్ని పెంపొందించడానికి పెద్ద ఎత్తున కమ్యూనిటీ ప్రయత్నాలలో చురుకుగా పాల్గొంటారు. అతను దేశీయంగా జాతీయ సమైక్యత కోసం తన ప్రయత్నాలతో ఒక ముద్ర వేశారు. విదేశాలలో ఉన్న భారతీయ ప్రవాసులతో విస్తృతంగా పనిచేశారు.

 


లక్షలాది మంది విద్యార్థులు చదువుకునేందుకు సంధు పరోక్షంగా, ప్రత్యక్షంగా కారణమయ్యారు. రెండు ఎన్ జి ఓ సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ రెండు సంస్థల ద్వారా ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు మతసామరస్యం పెంపొందించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ సమైక్యత కోసం సంధు పలు కార్యక్రమాలను నిర్వహించారు. విదేశాల్లోని ప్రవాసులతో కూడ కలిసి పనిచేశాడు.

సత్నామ్ సంధును రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.ప్రముఖ విద్యావేత్తగా , సామాజిక కార్యకర్తగా సంధు పేరొందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.జాతీయ సమైఖ్యత కోసం సంధు నిరంతరం పనిచేసిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు.

 


మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి