ఆర్టికల్ 370 రద్దుకు రాష్ట్రపతి ఆమోదం

| Edited By:

Aug 07, 2019 | 12:01 PM

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిన కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. భారత పార్లమెంట్ సిఫారసు మేరకు జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు రాష్ట్రపతి ఆమోదం తెలియజేయడమైనదని.. ఇక నుంచి ఆర్టికల్ 370లోని క్లాజ్‌లు చెల్లవంటూ నోటిఫికేషన్‌లో పేర్కొంది. రాష్ట్రపతి నోటిఫికేషన్ వెలువడంతో ఇక ఆర్టికల్ 370 జమ్ముకశ్మీర్‌కు వర్తించవు. దీని ప్రకారం ఇక నుంచి జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతమవుతుంది. […]

ఆర్టికల్ 370 రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
Follow us on

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిన కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. భారత పార్లమెంట్ సిఫారసు మేరకు జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు రాష్ట్రపతి ఆమోదం తెలియజేయడమైనదని.. ఇక నుంచి ఆర్టికల్ 370లోని క్లాజ్‌లు చెల్లవంటూ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

రాష్ట్రపతి నోటిఫికేషన్ వెలువడంతో ఇక ఆర్టికల్ 370 జమ్ముకశ్మీర్‌కు వర్తించవు. దీని ప్రకారం ఇక నుంచి జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతమవుతుంది. లడక్ రెండో కేంద్ర పాలిత ప్రాంతమవుతుంది. అంతేకాదు జమ్మూకశ్మీర్ సొంత జెండా అదృశ్యమవుతుంది. ఆ స్థానంలో భారత జాతీయజెండాను ఎగురవేస్తారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో దేశంలోని ఏ ప్రాంతం వారైనా జమ్మూకశ్మీర్‌లో ఆస్తుల కొనుగోలు, వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.