Viral Video: ఒరేయ్ ఎవర్రా మీరంతా..? రైల్వే ట్రాక్‌పై ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్.. చివరకు ఏం జరిగిందంటే..

|

Feb 15, 2023 | 3:58 PM

ప్రీ వెడ్డింగ్ షూటింగ్ జరుగుతుండగా డీఎస్పీ నరేష్ కుమార్, అన్నోథియా సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి రైల్వే ట్రాక్‌ వెంబడి ప్రయాణిస్తున్నారు. ఇది చూసి వారు కారు ఆపి వారి దగ్గరికి చేరుకున్నాడు.

Viral Video: ఒరేయ్ ఎవర్రా మీరంతా..? రైల్వే ట్రాక్‌పై ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్.. చివరకు ఏం జరిగిందంటే..
Pre Wedding Photoshoot
Follow us on

ప్రీ వెడ్డింగ్ షూట్‌లకు క్రేజ్ ఎంతగా పెరిగిందంటే.. జంటలు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సైతం వెనకాడటం లేదు. తాజాగా, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో రైల్వే ట్రాక్‌పై ఫోటోషూట్ చేస్తున్న వారిపై ఓ ట్రాఫిక్ డీఎస్పీ ఆగ్రహం వ్యక్తంచేస్తూ కనిపించారు. అటుగా వెళ్తున్న డీఎస్పీ ప్రీ వెడ్డింగ్ షూట్ చూసి.. అక్కడే ఆగిపోయారు. అనంతరం రైల్వే ట్రాక్ వైపు వెళ్లి.. ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న వారిని పట్టుకుని.. ఏం చేస్తున్నారంటూ మందలించారు. దీంతో దంపతులు, ఫొటోలు, వీడియో తీసిన వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం.. నూతన జంట ఢిల్లీ-ముంబై రైల్వే ట్రాక్‌పై ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు. కాబోయే వధూవరులతో పాటు, కెమెరామెన్‌ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు.

ప్రీ వెడ్డింగ్ షూటింగ్ జరుగుతుండగా డీఎస్పీ నరేష్ కుమార్, అన్నోథియా సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి రైల్వే ట్రాక్‌ వెంబడి ప్రయాణిస్తున్నారు. ఇది చూసి వారు కారు ఆపి వారి దగ్గరికి చేరుకున్నాడు. ఈ మొత్తం ఘటనను నరేష్ కుమార్ వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. మీకు పిచ్చి పట్టిందా, ఏం చేస్తున్నారు.. ఇక్కడ ఎలాంటి వీడియో చేయడానికి అనుమతి లేదని మీకు తెలియదా..? ట్రాక్ మధ్యలో పడుకుని మరి వీడియో చేస్తున్నారు. ఇప్పుడు రైలు బయలుదేరుతుంది.. అని మీకు తెలియదా..? డేంజర్ జోన్ లో ఇలా ఎలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. లేకుంటే నేను పోలీసులను పిలిచి లోపల వేయిస్తాను అంటూ మందలించి అక్కడినుంచి పంపించేశారు.

ఇవి కూడా చదవండి

Viral News

వీడియో చూడండి..

అధికారిని చూసిన వెంటనే నూతన వధూవరులు, కెమెరామెన్ అక్కడి నుంచి పరుగులు తీస్తూ కనిపించారు. డీఎస్పీ అక్కడికి చేరుకున్న సమయంలో నూతన జంట ట్రాక్ పై కూర్చొని కనిపించారు. డీఎస్పీ నరేష్ కుమార్ మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి ప్రతి 5 నిమిషాలకు సూపర్ ఫాస్ట్ రైళ్లు బయలుదేరుతాయని చదువుకున్న వారు ఇలా చేయడం ఏంటంటూ ప్రశ్నించారు.

ట్రాక్‌పై ముగ్గురు మృతి..

నివేదిక ప్రకారం, షూటింగ్ సమయంలో కొన్ని నెలల క్రితం ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై ఇద్దరు యువకులు, ఓ బాలిక రీళ్లు తయారు చేస్తున్నారు. తన వీడియో షూట్‌లో మునిగిపోయిన వారు రైలు హారన్ మోగిస్తున్నప్పటికీ వినకుండా.. అక్కడే ఉన్నారు. దీంతో రైలు ఢీకొని వారు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..