Prashant Kishor: యూపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?.. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు..

| Edited By: Anil kumar poka

Feb 23, 2022 | 5:58 PM

జాతీయ రాజకీయలపై సంచనల ప్రకటన చేశారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor). ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చని కామెంట్ చేశారు. అంతేకాదు ప్రస్తుతం బెంగాల్‌లో..

Prashant Kishor: యూపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?.. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు..
Prashant Kishor
Follow us on

జాతీయ రాజకీయాల్లో నెలకొన్ని ప్రస్తుత పరిస్థితులపై సంచనల ప్రకటన చేశారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor). ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో(Uttar Pradesh Assembly Election 2022 ) ఏమైనా జరగొచ్చని కామెంట్ చేశారు. అంతేకాదు ప్రస్తుతం బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌తో(TMC) బంధం కొనసాగుతోందన్నారు. 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికలను నిర్ణయించే సెమీ-ఫైనల్‌గా యూపీ ఎన్నికల ఫలితాలను చూడకూడదని ప్రశాంత్ కిషోర్ నొక్కి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. యూపీ ఫలితాన్ని ఊహించడం అసాధ్యమన్నారు. మమతా బెనర్జీ, నితీష్ కుమార్‌లతో తనకున్న సంబంధాల గురించి పత్రికల్లో వచ్చిన ఊహాగానాలపై క్లుప్తంగా వివరించారు. అంతే కాదు బీజేపీని అడ్డుకోవడం ప్రతిపక్ష పార్టీలతో సాధ్యమయ్యే అంశమేనా అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. జాతీయ రాజకీయాలతో పాటుగా జరుగుతున్న ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్ర ఎన్నికల గురించి సీనియర్ జర్నలిస్ట్ కరణ్ తాపర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రశాంత్ కిషోర్ ఆ వివరాలను వెల్లడించారు.

ఇది సెమీ-ఫైనల్‌..

అయితే, 2024లో జరిగే జాతీయ ఎన్నికలను నిర్ణయించే సెమీ-ఫైనల్‌గా యూపీ ఎన్నికల ఫలితాలను చూడక తప్పదని ఆయన అన్నారు. 2012లో యూపీ రాష్ట్ర ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ చాలా పేలవంగా పని చేసిందని ఆయన అన్నారు. 2014 జాతీయ ఎన్నికల్లో దాని అదృష్టాన్ని పూర్తిగా తారుమారైందన్నారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం పరిస్తితులు మారిపోయాయన్నారు. ఇప్పుడు జరుగుతున్నరాజకీయ ప్రచార ర్యాలీలలో కనిపించే జన సంఖ్యను బట్టి ఫలితాన్ని అంచనా వేయవద్దని సూచించారు. అఖిలేష్ యాదవ్ రోడ్-షో, ర్యాలీలకు కాన్పూర్‌లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడాన్ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు.

ప్రస్తుత యూపీ ప్రచారానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. 2022లో పోలరైజేషన్ ప్రభావం మనం గత ఎన్నికల్లో చూసిన దానికి భిన్నంగా ఉండదని అన్నారు. దాదాపు 50% మంది హిందూ ఓటర్లు పోలరైజ్డ్ క్యాంపెయిన్ వల్ల ప్రభావితమవుతారని డేటా చెబుతోందని ఆయన అన్నారు. మిగిలినవారు అలా కాదన్నారు. 2022లో ఈ శాతం ఎంత వరకు పెరుగుతుందో చెప్పలేమన్నారు. యూపీ ప్రచారంలో ప్రధానంగా రెండు పార్టీల మధ్య పోరు ఉందన్నారు ప్రశాంత్ కిషోర్. కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీలు మూడు, నాల్గవ స్థానంలో ఉండవచ్చని తేల్చి చెప్పారు.

మమతా బెనర్జీతో దోస్తీ..

పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత తృణముల్ కాంగ్రెస్‌తో దోస్తీ విడిపోతుందంటూ వస్తున్న ప్రచారాన్ని ప్రశాంత్ కిషోర్ కొట్టిపారేశారు. గోవా తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ కండోల్కర్ చేసిన ఆరోపణలను ఖండించారు. తాను గోవాలో ఉన్నప్పటికీ టీఎంసీ ప్రచారంలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. తాను కేవలం గోవాలో ఆ పార్టీ తీరును మాత్రమే అధ్యయనం చేయడం జరిగిందన్నారు. అయితే.. మమతా బెనర్జీతో ప్రశాంత్ కిషోర్ చెడిందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఇవి హెడ్‌లైన్స్ కోసం జర్నలిస్టులు ప్రచారం చేసిన కథనాలు అంటూ వ్యాఖ్యానించారు.

బీజేపీని ఓడించాలంటే..

జాతీయ రాజకీయాలకు సంబంధించిన విషయంలో బీజేపీని సైద్ధాంతికంగా ఎదుర్కోవాలంటే ముందుగా మూడు అంశాలపై ప్రతిపక్షాలకు క్లారిటీ ఉండాలన్నారు. హిందుత్వన్ని సవాలు చేయడం ద్వార ఆ పార్టీకి హిందుత్వంతో ఉన్న బంధాన్ని తెంచగలమా అని ప్రతిపక్షాలు ప్రశ్నించుకోవాలని అన్నారు. బీజేపీని ఓడించాలంటే.. ముందుగా ప్రతిపక్షాల ఐక్యత అవసరమన్నారు. దేశ వ్యాప్తంగా కాకుండా రాష్ట్రాల వారీగా అంచనా వేయాలని ఆయన అన్నారు. బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్ర వంటి రాష్ట్రాలను విడిగా చూడాలన్నారు. ఆ రాష్ట్రాల్లో బీజేపీ పరిస్తితిపై కొంత ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉందన్నారు. మరోవైపు బీహార్‌లో ప్రతిపక్షాలు ఏకమైనప్పటికీ బీజేపీని ఓడించలేకపోయాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన ప్రశాంత్ కిషోర్.. ప్రాంతీయ పార్టీల కలయికతో కాంగ్రెస్ స్థానాన్ని అంచనా వేయలేమన్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీపై మాట్లాడేందుకు నిరాకరించారు.

ఇవి కూడా చదవండి: Ramya Raghupathi: నరేశ్ మాజీ భార్య మోసాల చిట్టా చాంతాడంత.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..

Telangana: తెరమీదకు మరో కీలక అంశం.. ఉద్యమానికి గులాబీ నేతల శ్రీకారం