బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన..!

|

Aug 25, 2024 | 7:58 PM

Prashant Kishor: వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. గాంధీ జయంతి వేళ అక్టోబర్ 2న తాను ఏర్పాటు చేస్తున్న ‘జన్ సురాజ్’ పార్టీ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. బీహార్ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకు జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించిన ఆయన..

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన..!
Prashant Kishor
Follow us on

Bihar Assembly Election 2025: వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తాను ఏర్పాటు చేస్తున్న ‘జన్ సురాజ్’ పార్టీ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. బీహార్ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకు జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించిన ఆయన.. ఇందులో కనీసం 40 మంది మహిళా అభ్యర్థులకు కేటాయించనున్నట్లు తెలిపారు. 2030లో 70-80 మంది మహిళలను అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుపుతామని చెప్పారు. జన్ సురాజ్ యాత్రలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ప్రశాంత్ కిషోర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలు తెలిపారు.

మహిళలు ఆర్థికంగా స్వతంత్రులయ్యే వరకు వారికి సమానత్వం పొందలేరని పీకే వ్యాఖ్యానించారు. మహిళలను నాయకురాళ్లుగా తీర్చిదిద్దేందుకు తమ పార్టీ ప్రయత్నం చేస్తుందన్నారు. మహిళలను అధిక సంఖ్యలో అసెంబ్లీకి పంపాలన్నది జన్ సురాజ్ లక్ష్యంగా చెప్పారు. 2025లో జన్ సూరజ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం రూ.10-12 వేల నెల జీతం కోసం ఎవరూ బీహార్‌ను విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. దీని కోసం తాము పూర్తి బ్లూప్రింట్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

వీడియో చూడండి..

తేజస్వి యాదవ్‌పై విరుచుకపడ్డ పీకే..

బీహార్ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఇచ్చిన ప్రకటనపై ప్రశాంత్ కిషోర్ పెదవి విరిచారు. తేజస్వి యాదవ్ కులం, దోపిడీ, మద్యం మాఫియా, నేరాలపై మాట్లాడితే అర్థముంది కానీ, ఆయన అభివృద్ధి నమూనా గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆయనకు జీడీపీ, జీడీపీ వృద్ధి అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. అర్నెళ్ల క్రితం బీహార్‌‌కు తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం‌గా అధికారంలో ఉన్న సమయంలో.. బీహార్ ఆయనకు స్విట్జర్లాండ్‌లా కనిపించిందని ఎద్దేవా చేశారు. అధికారం పోయిన తర్వాతే ఆయనకు బీహార్‌లో అభివృద్ధి లేదన్న విషయం గుర్తుకు వచ్చిందన్నారు. ఈరోజు నితీష్ కుమార్ మహాకూటమిలో చేరితే వారు మళ్లీ ఆయన్ను నెత్తికి ఎత్తుకుంటారని ఎద్దేవా చేశారు. నేతలు, వారి వారసులను నమ్ముకుని ప్రజలు గుడ్డిగా వారికి ఓటు వేయొద్దని పీకే పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి