PK Mission: కొత్త పార్టీ పెట్టడం లేదు.. పాదయాత్ర చేస్తాను.. ఆయన పాలనపై పీకే కీలక వ్యాఖ్యలు..

|

May 05, 2022 | 6:10 PM

PK Bihar Mission: అక్టోబరు 2న గాంధీ జయంతి రోజు నుంచి పాదయాత్ర మొదలు పెట్టబోతున్నట్లు పీకే వెల్లడించారు. రాబోయే 3, 4 నెలల్లో 17 వేల మందిని కలుస్తానని చెప్పారు. అందరూ కలిసి వస్తే రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానన్నారు. ఒక వేళ రాజకీయ..

PK Mission: కొత్త పార్టీ పెట్టడం లేదు.. పాదయాత్ర చేస్తాను.. ఆయన పాలనపై పీకే కీలక వ్యాఖ్యలు..
Prashant Kishor
Follow us on

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌(Prashant Kishor)  టార్గెట్ మారిందా..? తన ఫ్యూచర్ ప్లాన్ ఎంటో తేల్చి చెప్పాడా..? అలాగే ఉంది తాజాగా పీకే చేసిన ప్రకటన. తన టార్గెట్ రాజకీయాలు కాదని.. కేవలం తన స్వంత రాష్ట్రం బీహార్ అభివృద్ది అని తేల్చి చెప్పాడు. ఇందు కోసం రాబోయే రోజుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందని ప్రకటించాడు. ఇదే సందర్భంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. బీహార్‌లో ఈ ఇద్దరు ఎలాంటి మార్పును తీసుకురాలేకపోయారని అన్నారు. 15 ఏళ్ల పాటు బీహార్‌ను లాలూ ప్రసాద్ పాలన సాగితే.. నితీష్‌ 17 ఏళ్లు పాలించారని పీకే విమర్శలు గుప్పించారు. సామాజిక న్యాయ తీసుకొస్తానని 15 ఏళ్లు  లాలూ రాజ్యం ఏలారు.. అదే ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ సుపరిపాలన, అభివృద్ధి అనే అంశాలతో పాల సాగించారని.. వీరిద్దరి పాలనలో బీహార్ 30 ఏళ్లు ఉన్నప్పటికీ ఏ మాత్రం ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు.

నీతి ఆయోగ్‌తో సహా ప్రతి నివేదికలో బీహార్ నేడు పేదరికంతోపాటు.. ప్రతి రంగంలో వెనుకబడి ఉందన్నారు. బీహార్ మారాలి.. కొత్త ఆలోచనతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు ప్రశాంత్ కిషోర్. అయితే తాను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం లేదన్నారు. కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం అవసరం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటానని స్పష్టం చేశారు.

అక్టోబరు 2న గాంధీ జయంతి రోజు నుంచి పాదయాత్ర మొదలు పెట్టబోతున్నట్లు పీకే వెల్లడించారు. రాబోయే 3, 4 నెలల్లో 17 వేల మందిని కలుస్తానని చెప్పారు. అందరూ కలిసి వస్తే రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానన్నారు. ఒక వేళ రాజకీయ పార్టీ పెట్టినా అది ప్రశాంత్ కిశోర్‌ది కాదని ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో వీలైనంత మందిని కలుసుకుంటానని చెప్పారు. బీహార్‌లో ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ప్రస్తుతం నా ప్రణాళికలో రాజకీయ పార్టీ లేదని వివరించారు. బీహార్‌లో సుపరిపాలనకు తన వంతు ప్రయత్నాలు చేశానని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

అవసరమైతే పార్టీ పెడతా – ప్రశాంత్ కిషోర్

గత కొద్ది రోజులుగా, నేను చాలా మందిని కలిశాను.. మేము కలిసి పని చేస్తాము. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటాము. నేను పార్టీ పెట్టినా.. అది నా పార్టీ మాత్రమే కాదు, నాతో జతకట్టే వారిదే పార్టీ. ఒక ఇటుక నాది.. ఒక ఇటుక వారిది. బీహార్‌ సమస్య ఏమిటో, బీహార్‌ను ఎలా మారుస్తారో తెలిసిన 17-18 వేల మందిని గుర్తించానని అన్నారు. వీరంతా కావాలంటే పార్టీ పెడతాను. 

ప్రశాంత్ కిషోర్ ఇంకా మాట్లాడుతూ.. 2 సంవత్సరాల క్రితం పాట్నాలో మీడియాతో మాట్లాడాను. ఆ సమయంలో నేను నా అభిప్రాయాన్ని చెప్పాను. ఆ తర్వాత 2 ఏళ్లకి మాయమైపోయాను కానీ ఈసారి అలా జరగదు. బీహార్‌లో చురుకుగా ఉండండి. నితీశ్‌తో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదన్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో తనను కలిశానని అన్నారు. ఆ సంద్భంలో ఆయన్ను నేనే రాష్ట్రపతిని చేస్తున్నట్టు వార్తలు రావడం మొదలయ్యాయి. ఇదంతా తప్పుడు వార్తలే. నితీష్ తన పని తాను చేస్తున్నారు. బీహార్ కోసం నా పని నేను చేస్తాను. అక్టోబర్ 2 నుంచి పశ్చిమ చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తాను. మొత్తం 3 వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను. ఏడాది పాటు బీహార్‌లో తిరుగుతుంటే ప్రజల ఆశలు, ఆకాంక్షలు, సమస్యలు ఏమిటో అర్థమవుతాయన్నారు. బీహార్‌ను పదేళ్లలోపు అభివృద్ధి చెందిన రాష్ట్రాల కేటగిరీలోకి తీసుకురావాలన్నారు ప్రశాంత్ కిషోర్.

తేజస్విని ఎదుర్కోవడంపై దృష్టి పెట్టను: ప్రశాంత్ కిషోర్

బీహార్‌లో ఏ పని చేసినా ప్రజలు ఆదరిస్తారు. బీహార్‌లో ప్రధాని మోడీకి అత్యధిక ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు ఆయన పని మీద ఆధారపడి ఉన్నాయి. ప్రజానీకం నా పనిని చూస్తారని, దాని ఆధారంగానే నాపై అభిప్రాయం ఏర్పడుతుందన్నారు. అదే సమయంలో బీహార్ అభివృద్ధి కోసం నితీశ్‌ కుమార్ ఏడు ప్లాన్లతో ముందుకు వెళ్తున్నారు. అవి ఎంత వరకు విజయవంతమైందో ఆయనే చెప్పాలన్నారు. నితీష్‌తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి.. కానీ ఆయన కంటే భిన్నమైన అభిప్రాయం, భావజాలం నాకు ఉండవచ్చు. నితీష్ 17 ఏళ్లుగా సీఎంగా ఉన్నారు. అతని అనుభవాన్ని నేను సద్వినియోగం చేసుకోగలను. బీహార్‌ను మార్చే నా ప్రయత్నాల్లో నేను ఏ అవకాశాన్ని వదిలిపెట్టను. తేజస్వి యాదవ్ గురించి మాట్లాడుతూ..  తేజస్విని పట్టించుకోవల్సిన అవసరం లేదన్నారు. 

జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి