క్షీణిస్తోన్న ప్రణబ్‌ ఆరోగ్యం

| Edited By:

Aug 31, 2020 | 11:48 AM

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి ఆయన సెప్టిక్ షాక్‌లో ఉన్నట్లు ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి

క్షీణిస్తోన్న ప్రణబ్‌ ఆరోగ్యం
Follow us on

Pranab Mukherjee health: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి ఆయన సెప్టిక్ షాక్‌లో ఉన్నట్లు ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రణబ్‌కి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ సమస్య ఉండటంతో ప్రత్యేక వైద్య బృందాలు చికిత్సను అందిస్తున్నాయి. ఆయన కోమాలోనే ఉన్నారని, వెంటిలేటర్ సహాయంతో చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యాధికారులు వెల్లడించారు. కాగా ఆగష్టు 10న మెదడుకు అత్యవసర చికిత్స నిమిత్తం ప్రణబ్‌ ఆసుపత్రిలో చేరారు. సర్జరీ తరువాత జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అక్కడే చికిత్స తీసుకుంటూ వచ్చారు. ఇక సర్జరీ తరువాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పాటు గత కొన్ని రోజులుగా కోమాలోనే ఉన్నారు.

Read More:

కరోనాతో దేశ మొదటి మహిళా కార్డియాలజిస్ట్‌ మృతి

ఆన్‌లైన్‌ క్లాసులు.. జైల్లో సంపాదించిన డబ్బులతో కూతురికి ఫోన్‌