‘దక్షిణాదికి ప్రత్యేక దేశం ఇవ్వండి..’ కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలకు.. ప్రహ్లాద్ జోషి కౌంటర్..

ఢిల్లీ పార్లమెంట్ లో ఓటాన్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. దేశ విభజనపై చేసిన ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. ఇది రాజ్యాంగ విరుద్దమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను నీరుగార్చడమే అని రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అని మండిపడ్డారు.

దక్షిణాదికి ప్రత్యేక దేశం ఇవ్వండి.. కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలకు.. ప్రహ్లాద్ జోషి కౌంటర్..
Prahlad Joshi

Updated on: Feb 02, 2024 | 2:42 PM

ఢిల్లీ పార్లమెంట్ లో ఓటాన్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. దేశ విభజనపై చేసిన ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. ఇది రాజ్యాంగ విరుద్దమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను నీరుగార్చడమే అని రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అని మండిపడ్డారు. ఇలా దేశాన్ని విభజించడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన డీకే సురేష్ పై పార్లమెంటరీ యాక్షన్ కమిటీ చర్యలు తీసుకోవాలని కోరారు.

తామందరం దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్లమేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము దేశాన్ని విభజించాలని అనుకోవడం లేదని దక్షిణ, ఉత్తర భారతదేశం మొత్తం ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా అంబేద్కర్ ను కూడా అవమానించిన వారైతారన్నారు. అలాగే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దీనిపై స్పందించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..