AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Charges: విద్యుత్ ఛార్జీలపై కేంద్రం షాకింగ్ డెసిషన్.. త్వరలో పెరగనున్న బిల్లు.. ఎంతంటే..?

దేశంలో కరెంట్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు స్థిర ఛార్జీలను పెంచాలని కేంద్ర విద్యుత్ అథారిటీ సిఫార్సు చేసింది. సోలార్ వినియోగం పెరుగుతున్న క్రమంలో విద్యుత్ వినియోగం తగ్గుతుంది. దీని వల్ల డిస్కంలకు ఆదాయం తగ్గి నష్టం చేకూరుతోంది. దీంతో స్థిర ఛార్జీలలు పెంచాలని సిఫార్సు చేసింది.

Power Charges: విద్యుత్ ఛార్జీలపై కేంద్రం షాకింగ్ డెసిషన్.. త్వరలో పెరగనున్న బిల్లు.. ఎంతంటే..?
Power Bill
Venkatrao Lella
|

Updated on: May 20, 2026 | 1:10 PM

Share

దేశ ప్రజలకు కేంద్రం షాకివ్వనుంది. రానున్న రోజుల్లో విద్యుత్ బిల్లు మరింత పెరగనుంది. విద్యుత్ టారిఫ్ విధానంలో కేంద్రం మార్పులు చేసేందుకు సిద్దమవుతోంది. విద్యుత్ కస్టమర్లపై విధిస్తున్న స్ధిర ఛార్జీలను పెంచాలని కేంద్ర విద్యుత్ అథారిటీ ప్రతిపాదించింది. డిస్కంలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా పరిశ్రమలు, సంపన్నులు సొంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నారు. రూఫ్‌టాప్ సోలార్, క్యాప్టివ్ పవర్ వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని వల్ల విద్యుత్ కొనుగోళ్లు తగ్గడంతో డిస్కంలకు ఆదాయం కూడా పడిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్ధిర ఛార్జీలను పెంచాలని కేంద్రం భావిస్తోంది.

దశలవారీగా స్ధిర ఛార్జీలు పెంపు

అయితే ఒకేసారి కాకుండా దశలవారీగా స్ధిర ఛార్జీలను పెంచాలని కేంద్ర విద్యుత్ అథారిటీ ప్రతిపాదించింది. 2030 నాటికి గృహా, వ్యవసాయ వినియోగదారుల నుంచి 25 శాతం స్థిర వ్యయాలను వసూలు చేయాలని సిఫార్సు చేసింది. ఇక పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ వినియోగదారుల నుంచి 100 శాతం స్ధిర ఛార్జీలను వసూలు చేయాలని సూచించింది. దీంతో రానున్న కొన్ని ఏళ్లల్లో విద్యుత్ బిల్లులో నెలవారీ స్థిర ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం తగ్గినా స్థిర ఛార్జీలు భవిష్యత్తులో చెల్లించాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం డిస్కంలకు ఆదాయం విద్యుత్ ఛార్జీల నుంచే వస్తోంది. డిస్కంల ఆదాయంలో స్థిర ఛార్జీల భాగం తక్కువగా ఉంది. దీంతో విద్యుత్ వినియోగం తగ్గినప్పుడు ఆదాయం కూడా తగ్గుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థిర ఛార్జీలను సవరించాలని విద్యుత్ అధారిటీ సూచించింది.

విద్యుత్ కంపెనీలపై తగ్గనున్న భారం

విద్యుత్ కంపెనీలకు వచ్చే ఆదాయం ఉద్యోగులు జీతాలు, నెట్ వర్క్ నిర్వహణ, విద్యుత్ ఉత్పాదక సంస్థలకు చెల్లింపులకు సరిపోతుంది. ఇటీవల రూఫ్‌టాప్ సోలార్ సిస్టంల సంఖ్య పెరుగుతోంది. సొంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటున్న కంపెనీలు గ్రిడ్‌ నుంచి కొనుగోళ్లను తగ్గించాయి. అవసరమైనప్పుడు మాత్రమే విద్యుత్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ కారణంతో విద్యుత్ సంస్థలకు ఆదాయం తగ్గుతుంది. ఈ క్రమంలో రూఫ్ టాప్ సోలార్, నెట్ మీటరింగ్ వినియోగదారుల కోసం ప్రత్యేక టారిఫ్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం విద్యుత్ సంస్థ సిఫార్సు చేసింది. గ్రిడ్‌ను ఉపయోగించే వినియోగదారులు దాని నిర్వహణ ఖర్చులకు కూడా సహకరించేలా కొత్త రూల్ తీసుకురానున్నారు. ఈ చర్య విద్యుత్ కంపెనీలపై భారం తగ్గిస్తుంది.

Follow Us
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..