vk sasikala put up in chennai ఫ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు జీవితం గడిపిన ఏఐఏడీఎంకే మాజీ నాయకురాలు, జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ఇటీవలే బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆమె సోమవారం చెన్నైకు వెళ్లనున్నారని తెలుస్తుంది. కరోనా సోకడంతో చికిత్స పొంది కోలుకున్న శశికళ కొన్ని రోజులుగా ఐసొలేషన్‌లో ఉన్నారు. తాజాగా ఆ గడువు ముగియనుండటంతో సోమవారం సాయంత్రం ఆమె తమిళనాడుకు చేరుకుంటారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
శశికళ చెన్నైకి వస్తుండటంతో ఆమె వర్గం తమిళనాడులో అల్లర్లకు, హింసాత్మక చర్యలకు పాల్పడాలని భావిస్తోందని అన్నాడీఎంకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు శశికళ తమిళనాడులోకి అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె వర్గం ఏర్పాట్లు చేస్తోంది. శశికళ అభిమానులు చెన్నై నగరంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. శశికళ, జయలలితోపాటు అన్నాడీఎంకే నేతల ఫొటోలతో కూడిన పోస్టర్లు, బ్యానర్లు ,కటౌట్లు నెలకొల్పారు. ఇక చిన్నమ్మను కలిసేందుకు అన్నాడీఎంకే నేతలు వెళ్తే ఉపేక్షించేంది లేదని, పార్టీ నుంచి బహిష్కరిస్తామని అధిష్టానం ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది. చూడాలి మరి జరుగుతుందో…
ఇదీ చదవండి… శశికళకు మరో షాక్ ఇచ్చిన తమిళ సర్కార్.. జయలలిత దత్తపుత్రుడు సుదాకరన్ ఆస్తుల జప్తు..