Post Office Monthly Income Scheme: అదిరిపోయే బెనిఫిట్.. పోస్టాఫీసులో ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.5 వేల ఆదాయం

|

Feb 05, 2021 | 11:45 AM

Post Office Monthly Income Scheam: పోస్టాఫీసుల్లో అన్ని రకాల పథకాలను ప్రవేశపెడుతోంది కేంద్ర ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని.

Post Office Monthly Income Scheme: అదిరిపోయే బెనిఫిట్.. పోస్టాఫీసులో ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.5 వేల ఆదాయం
Follow us on

Post Office Monthly Income Scheme: పోస్టాఫీసుల్లో అన్ని రకాల పథకాలను ప్రవేశపెడుతోంది కేంద్ర ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని వారికి మేలు చేకూరే విధంగా వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది పోస్టల్‌ శాఖ. అయితే చేతిలో డబ్బులు ఉండి, వీటిని ఎక్కడైన ఇన్వెస్ట్‌ చేయాలని అనుకునే వారికి మంచి అవకాశం. ఇందుకు వారి కోసం పోస్టల్‌ శాఖలో ఒక ఆప్షన్‌ అందుబాటులో ఉంది. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాబడి పొందవచ్చు.

అయితే పోస్టాఫీస్‌ పలురకాల స్కీమ్‌లు అందిస్తోంది. వీటిల్లో మంత్లి ఇన్‌కమ్‌ స్కీమ్‌ కూడా ఒకటి ఉంది. ఈ స్కీమ్‌లో చేరితే ప్రతినెల డబ్బులు వస్తాయి. సింగిల్‌ లేదా జాయింట్‌ అకౌంట్‌ తెరవచ్చు. మీరు కనీసం రూ.1000 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే వెయ్యి రూపాయలు పెడితే మీకు వచ్చే లాభం ఏమి ఉండదు. పోస్టాఫీసు నుంచి నెల ఆదాయం స్కీమ్‌లో మీరు గరిష్ఠంగా రూ.4.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. జాయింట్‌ అకౌంట్‌ అయితే రూ.9 లక్షలు కూడా డిపాజిట్‌ చేసే అవకాశం ఉంటుంది. ఒకేసారి డబ్బులు పెట్టాలి. తర్వాత ప్రతి నెల రాబడి పొందే అవకాశం ఉంటుంది. రిటైర్డ్‌ అయిన ఉద్యోగులకు, సీనియర్‌ సిటిజన్స్‌కు ఈ స్కీమ్‌ అనుగుణంగా ఉంటుంది.

మీరు దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి మంత్లి ఇన్‌కమ్‌ స్కీమ్‌లో చేరవచ్చు. ఐడీ ఫ్రూప్‌, అడ్రస్‌ ఫ్రూప్‌, రెండు పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటోలు వంటికి అందజేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసులో ఫారం నింపి మంత్లి ఇన్‌కమ్ ఖాతాను తెరుచుకోవచ్చు. మీరు పెట్టిన ఇన్వెస్ట్‌ మెంట్‌ డబ్బులను ఐదేళ్ల తర్వాత వెనక్కి తీసుకోవచ్చు. అంత వరకు ప్రతినెలా వడ్డీ డబ్బులు వస్తుంటాయి.

ఉదాహరణకు… మీరు పోస్టాఫీసులో జాయింట్‌ మంత్లి ఇన్‌కమ్‌ స్కీమ్‌ అకౌంట్‌ను తెరిచి అకౌంట్‌లో రూ. 9 లోల డిపాజిట్‌ చేశారని అనుకుంటే.. మీకు ఏడాదికి రూ.59,400 వేల వడ్డీ వస్తుంది. అంటే నెలకు రూ.5 వేల చొప్పున వస్తాయన్నమాట. ప్రస్తుతం ఈ స్కీమ్‌ రూ.6.6 వడ్డీ లభిస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మీ దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి తెలుసుకోవచ్చు.

Aslo Read:

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి అకౌంట్‌ ఓపెన్‌ చేయడం ఎలా.. ? అందులో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడం ఎలా?

Kisan Credit Card: కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ కార్డును ఎవరెవరు పొందవచ్చు