Corona Vaccination: కరోనా వ్యాక్సినేషన్.. సురక్షితంగా సేవలందించేందుకు వీలుగా పోలీసులకు రెండో దశ కోవిడ్ టీకా
Corona Vaccination: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దాదాపు ఏడాది కాలంగా కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. దేశ..
Corona Vaccination: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దాదాపు ఏడాది కాలంగా కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. దేశ వ్యాప్తంగా మొదటి దశ వ్యాక్సిన్ వేయడం కొనసాగుతోంది. ఇక హర్యానాలో పోలీసులకు కోవిడ్ రెండో దశ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమైంది. హర్యానా పోలీసు డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ పంచకుల పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చారు.
ఫ్రంట్ లైన్ వారియన్స్ అయిన హర్యానా పోలీసులందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. కరోనా లాక్‌డౌన్ సందర్భంగా పేదలకు సాయం చేయడం, వలస కార్మికులను ఆదుకోవడంలో హర్యానా పోలీసులు ముందున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమిస్తున్న హర్యానా పోలీసులు సురక్షితంగా సేవలందించేందుకు వీలుగా రెండో దశ కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. హర్యానాలో మొత్తం 2,63,989 మందికి కరోనా సోకగా, వారిలో 3,023 మంది మృతి చెందారు.