కోవిద్ పాండమిక్ కారణంగా ఆహార భద్రతా లేమి (ఫుడ్ ఇన్ సెక్యూరిటీ), ఉపాధి కరవు వంటి కారణాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఏపీ) యువతలో డిప్రెషన్ పెరిగిందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిణామం వీరి మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపినట్టు ఇందులో పేర్కొన్నారు. మెడ్ ఆర్ క్వివ్ అనే ఆన్ లైన్ పోర్టల్ లో ఈ స్టడీని ప్రచురించారు. ఫుడ్ ఇన్ సెక్యూరిటీ వల్ల యువతలో ఆందోళన (యాంగ్జైటీ) తలెత్తిందని, ఉపాధి కరవు వంటి అంశాలు వీరిలో డిప్రెషన్ ని పెంచాయని అధ్యయనకర్తలు ఇందులో వివరించారు. ఈ పరిస్థితి వెంటనే మారాల్సి ఉందన్నారు. పిల్లలు లేదా పెద్దల కన్నా టీనేజర్లు ఈ స్థితికి గురవుతుంటారు.. ఇందుకు తక్షణ చర్యలు తీసుకోవడం ఉత్తమం అని సూచించారు. కోవిద్ కేసులు తగ్గినప్పటికీ పరిస్థితిలో మెరుగుదల కనిపించడం లేదన్నారు. ఇందుకు మానసిక శాస్త్రజ్ఞులు కూడా చొరవ చూపి వీరిని ఈ స్థితి నుంచి మళ్ళించవలసి ఉందని స్టడీ నిర్వాహకులు పేర్కొన్నారు.హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ కి చెందిన రీసెర్చర్లు కూడా ఈ అధ్యయనానికి తమ వంతు సహకారం అందించారు.
పాండమిక్ కి ముందు టీనేజర్ల ప్రాయంలోనే వారిలో 75 శాతం మెంటల్ హెల్త్ కండిషన్స్ తలెత్తాయని.. క్రమంగా వారు డిప్రెషన్ కి గురవుతూ వచ్చారని పరిశోధకులు వెల్లడించారు. ఇక దేశ ఆర్థిక సంక్షోభం కూడా ఇందుకు దారి తీసినట్టు తెలిపారు. గత ఏడాది ఆగస్టు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల కాలంలో యువత మానసిక స్థితిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ప్రధానంగా పేద యువత డిప్రెషన్ కి గురైనట్టు వీరు నిర్ధారించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:టీకా కోసం తోపులాట…అంత రచ్చ రచ్చ..ఇలాఐతే థర్డ్ వేవ్ కాదు.. ఎన్ని వేవులైన వస్తాయంటూ కామెంట్లు:vaccine centre video.
రంగంలోకి దిగిన ‘ఎఫ్ 3’ టీమ్..! మెల్లగా నవ్వులు మొదలు సెట్ లో సందడే సందడి:F3 Movie video.