Pollution claime: ఊపిరి తీస్తున్న వాయువు..కాలుష్య మరణాల్లో భారత్ టాప్.. మోగుతున్న డేంజర్ బెల్స్

|

May 18, 2022 | 7:33 PM

పర్యావరణ కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా పెను ముప్పుగా మారింది. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్, నీటి ఆవిరి సమతుల్యంగా ఉంటేనే వన్యప్రాణులు, వ్యవసాయానికి, మానవుని అభివృద్ధికి అది సహాయపడుతుంది. కానీ, ప్రస్తుతం మనచుట్టూ పెరిగిపోయిన కాలుష్యం కారణంగా

Pollution claime: ఊపిరి తీస్తున్న వాయువు..కాలుష్య మరణాల్లో భారత్ టాప్.. మోగుతున్న డేంజర్ బెల్స్
Pollution
Follow us on

పర్యావరణ కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా పెను ముప్పుగా మారింది. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్, నీటి ఆవిరి సమతుల్యంగా ఉంటేనే వన్యప్రాణులు, వ్యవసాయానికి, మానవుని అభివృద్ధికి అది సహాయపడుతుంది. కానీ, ప్రస్తుతం మనచుట్టూ పెరిగిపోయిన కాలుష్యం కారణంగా ఏటా అనేకమంది ప్రజలు అకాల మృత్యువు బారిన పడుతున్నారు. మనం పీల్చే గాలే ఇప్పుడు ఊపిరి తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల కాలుష్యాల కారణంగా 2019లో 9 మిలియన్ల మరణించారని లాన్సెట్‌ అధ్యయనం తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ కాలుష్యంతో అకాల మృత్యువు బారిన పడుతున్నారని ఆ నివేదిక నిర్దారించింది.

చాలా మరణాలకు వాయు కాలుష్యం కారణం

2019లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కన్నా భారత్‌లోనే కాలుష్య మరణాలు అత్యధికమని లాన్సెట్‌ నివేదిక వెల్లడించింది. 23.5 లక్షల మందికి పైగా అకాల మృత్యువు బారిన పడ్డారని నివేదిక తెలిపింది. వాయు కాలుష్యం కారణంగా 16.7 లక్షల మంది మంది మరణించారని వెల్లడించింది. వాయు కాలుష్య మరణాల్లో అత్యధికంగా గాలిలో రెండున్న ర మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ ఉండే చిన్న కాలుష్య కారకాల కారణంగా(PM2.5)9.8 లక్షల మంది మరణించారని, మరో 6.1 లక్షల మంది గృహ వాయు కాలుష్యం కారణంగా మరణించారని శాస్త్రవేత్తలు తెలిపారు. పరిసరాల వాయు కాలుష్యం, గృహ కాలుష్యాలతో ప్రపంచ వ్యాప్తంగా 6.67 మిలియన్ల మంది మరణించారని తెలిపారు. కాలుష్య ప్రభావం ఆరోగ్యంపై తీవ్రంగా పడుతోందని, పేద, మధ్య తరగతి ఆదాయాలు కలిగిన దేశాలపై ఈ ప్రభావం అధికంగా ఉందని జెనీవా స్విట్జర్లాండ్‌ గ్లోబల్‌ అలయన్స్‌ ఆన్‌ హెల్త్‌ అండ్‌‌ పొల్యూషన్‌, అధ్యయన కర్త రిచర్డ్‌ ఫుల్లర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

 

కాలుష్యంలో భారత్-చైనా అగ్రస్థానంలో ఉన్నాయి

భారతదేశంలో కాలుష్యం కారణంగా ఏడాదిలో 24 లక్షల మంది మరణిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఢిల్లీలో ప్రతి సంవత్సరం చలికాలంలో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. గతేడాది చలికాలంలో ఢిల్లీలోని గాలి కాలుష్యం కాకుండా కేవలం రెండు రోజులు మాత్రమే ఉండేవి. మరోవైపు, 2019లో చైనాలో 21.7 లక్షల మంది కాలుష్య బాధితులుగా మారారు. 2015లో ఈ సంఖ్య 18 లక్షలు.

 

భారతదేశంలో రోజుకు 6,500 మరణాలు

2015లో దేశంలో 25 లక్షల మంది చనిపోతే, 2019లో 24 లక్షల మంది చనిపోయారు. కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల కారణంగా దేశంలో రోజుకు సగటున 6,500 మరణాలు జరుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది కరోనా మహమ్మారి సమయంలో మరణించిన వారి కంటే చాలా రెట్లు ఎక్కువ. అయితే, నివేదికలో ఉపశమనం కూడా ఉంది. నిజానికి 2015తో పోలిస్తే 2019లో మరణాల సంఖ్య తగ్గింది. 2015లో 25 లక్షల మంది చనిపోతే, 2019లో 24 లక్షల మంది చనిపోయారు.

 

356.66 లక్షల కోట్ల నష్టం, పేద దేశాలపై మరింత ప్రభావం

కాలుష్యం కారణంగా సంభవించిన ఈ మరణాల కారణంగా, 2019లో దాదాపు 356.66 లక్షల కోట్ల ఆర్థిక నష్టం సంభవించింది. ఇది ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో 6.2%కి సమానం. తక్కువ మరియు మధ్య-ఆదాయ దేశాలపై 92% కాలుష్య సంబంధిత మరణాలు, కాలుష్యం కారణంగా ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. 2014లో భారతదేశంలో వాయు కాలుష్యం క్యూబిక్ మీటరుకు 95 మిల్లీగ్రాములు (mg/m3)ఉండగా, అది 2017 నాటికి 82mg/m3కి తగ్గింది. కానీ, ఇటీవల మళ్లీ నెమ్మదిగా పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని 93 శాతం క్యూబిక్ మీటరుకు 10 మైక్రోగ్రాముల ( PM2.5)లకు పెరిగినట్టు నివేదిక వెల్లడించింది.