డీలిమిటేషన్ అనంతరం జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు, మోదీ
డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అనంతరం జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రస్తుతం ఆ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో డీలిమిటేషన్ ప్రక్రియ సాగుతోందని ఆయన శనివారం చెప్పారు.
డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అనంతరం జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రస్తుతం ఆ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో డీలిమిటేషన్ ప్రక్రియ సాగుతోందని ఆయన శనివారం చెప్పారు. అక్కడ త్వరలో ఎన్నికలు జరుగుతాయి.. ఆ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు సొంత ముఖ్యమంత్రులు, మంత్రులు ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు.
జమ్మూ కాశ్మీర్ లో ఈ ఏడాది వివిధ ప్రజా సంక్షేమ పనులు చేపట్టామని మోదీ పేర్కొన్నారు. అక్కడి మహిళలకు, దళితులకు వారికి తగిన హక్కులు లభించాయని, శరణార్థులకు గౌరవ ప్రదంగా జీవించే అవకాశం కూడా కలిగిందని ఆయన చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణపై ప్రధాని మాట్లాడడం ఇదే మొదటిసారి.