కస్టడీ డెత్‌ కేసులో అరెస్ట్‌.. కరోనాతో మృతి చెందిన పోలీస్‌

| Edited By:

Aug 10, 2020 | 3:50 PM

తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల(జయరాజ్‌, బెనిక్స్‌) కస్టడీ డెత్‌‌ కేసులో అరెస్టైన స్పెషల్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్

కస్టడీ డెత్‌ కేసులో అరెస్ట్‌.. కరోనాతో మృతి చెందిన పోలీస్‌
Follow us on

Accused policeman in Tamil Nadu custodial deaths: తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల(జయరాజ్‌, బెనిక్స్‌) కస్టడీ డెత్‌ కేసులో అరెస్టైన స్పెషల్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పాల్‌దురై కరోనాతో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం కన్నుమూశారు. అయితే సరైన చికిత్స అందించక పోవడం వలనే పాల్‌దురై చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై తూత్తుకుడి జిల్లాలో జయరాజ్‌, బెన్సిక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత వారిని స్టేషన్‌కి తీసుకెళ్లి చిత్రవధ చేయగా.. వారిద్దరు మరణించారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సర్కారు అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించారు. దీనిపై విచారణ జరిపిన సంస్థ సత్తాన్‌కులం పోలీస్‌ స్టేషన్‌కి చెందిన 10 మంది పోలీసు అధికారులను అరెస్టు చేసింది. అందులో పాల్‌దురై కూడా ఉన్నారు.

Read This Story Also: నాకు ఇంకో జాబ్‌ ఏమైనా ఉందా!