
ముంబాయిలో ఓ పబ్‌పై కొరఢా ఝులిపించారు. తాజాగా డ్రాగన్ ప్లై పబ్ పై పోలీసులు దాడులు చేశారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో క్రికెటర్ సురేష్ రైనా సహా 34 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే పోలీసులు 34 మందిని అరెస్టు చేయగా, వారు బెయిల్ పై విడులయ్యారు. పబ్ పై పోలీసులు దాడులు చేయడం తీవ్ర సంచలనంగా మారింది.
దేశంలో కరోనా మహమ్మారి నేపథ్యంలో పబ్‌లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల నిబంధనలను వ్యతిరేకంగా పబ్‌లను తెరుస్తుండటంతో పోలీసులు ఈ దాడులు చేస్తున్నారు. వీరందరిపై సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేశారు.
కాగా, నిబంధనలకు విరుద్దంగా పబ్ ను నిర్వహించడమే కాకుండా కరోనా నియమాలను పాటించడం లేదని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, రైనా ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తన మిత్రుడు, మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ సైత తన నిర్ణయాన్ని వెల్లడించి అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది