AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers Protest LIVE : దేశరాజధాని హస్తినలో 27వ రోజుకి చేరిన రైతు ఉద్యమం, రెండో రోజూ కొనసాగుతోన్న రైతుల నిరాహారదీక్ష

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో కొనసాగుతోన్న రైతు ఉద్యమం ఆగడంలేదు. కేంద్రం రైతు సంఘాలతో..

Farmers Protest LIVE : దేశరాజధాని హస్తినలో 27వ రోజుకి చేరిన రైతు ఉద్యమం, రెండో రోజూ కొనసాగుతోన్న రైతుల నిరాహారదీక్ష
Venkata Narayana
|

Updated on: Dec 22, 2020 | 1:13 PM

Share

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో కొనసాగుతోన్న రైతు ఉద్యమం ఆగడంలేదు సరికదా, రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. కేంద్రం రైతు సంఘాలతో ఇప్పటికే పలు ధపాలుగా చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. దీంతో రైతులతో మోదీ సర్కారు చర్చల పరంపర కొనసాగిస్తూ వస్తోంది. మరో వైపు, రైతన్నల నిరసనలు నేటికి 27 వ రోజుకు చేరుకున్నాయి. ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన రైతాంగం నిన్నటి నుండి నిరాహార దీక్షలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీక్షలు నేడుకూడా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ రోజు, కేంద్రం సింగు సరిహద్దులో రైతులతో సమావేశం జరుపనుంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Dec 2020 01:13 PM (IST)

    రహదారి దిగ్భంధనం నేపథ్యంలో ఢిల్లీ – ఘజియాబాద్ మధ్య ట్రాఫిక్ మళ్లింపు

    రైతుల నిరాహారదీక్షలు, ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ నుండి ఘజియాబాద్ వెళ్లే రహదారి స్థంభించిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రయాణీకులకు ఇబ్బంది కలుగకుండా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. రహదారిని మూసివేసి ఢిల్లీ, ఘజియాబాద్ వెళ్లే వాహనాలను ఆనంద్ విహార్, అప్సర, భోప్రా, డీఎన్డీ మీదుగా.. నిజాముద్దీన్ ఖత్తా, అక్షర్ధామ్, ఘాజిపూర్ చౌక్ నుండి ట్రాఫిక్ మళ్లించామని ప్రయాణీకులు, వాహనదారులు గమనించాలని ఢిల్లీ ఓటర్ రేంజ్ అదనపు ట్రాఫిక్ సీపీ వెల్లడించారు.

  • 22 Dec 2020 10:59 AM (IST)

    కేంద్ర ప్రభుత్వం అహాన్ని వదిలాలి – రాఘవ్ చద్దా

    మోదీ ప్రభుత్వం రైతులపట్ల అహంకారం చూపిస్తోందని ఆప్ యువ నేత రాఘవ్ చద్దా అభిప్రాయపడ్డారు. రైతుల డిమాండ్లు సమంజసమైనవన్న ఆయన, ఈ విషయంలో కేంద్రం పట్టుదలవీడాలని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని రాఘవ్ డిమాండ్ చేశారు.

  • 22 Dec 2020 10:47 AM (IST)

    శిబిరాల్లో నిరాహారదీక్షలు కొనసాగిస్తోన్న రైతులు

    వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. టెంట్లలో దీక్షకు కూర్చున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు పెద్దఎత్తున వస్తోన్న మద్దతుదారులకు వివిధ సంస్థలు టీపానియాలు ఏర్పాటు చేశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

  • 22 Dec 2020 09:49 AM (IST)

    లాల్ బహదూర్ శాస్త్రి తనయుడి అభ్యంతరం

    మూడు వ్యవసాయ చట్టాలపై సవరణకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కావున రైతులు తమ ఆందోళనను విరమించుకోవాలని భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రి కోరారు. రైతులు ధర్నాలు, ఆందోళనలు వీడి ప్రభుత్వంతో సహకరించి తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని ఆయన సూచించారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్, జై కిసాన్ స్లోగన్ కు భారతదేశంలో ఇప్పటికీ ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే.

  • 22 Dec 2020 09:36 AM (IST)

    ప్రభుత్వం కోరుకున్న చోట చర్చలు జరపడానికి మేము సిద్ధం : రాకేశ్ తికైత్

    రైతు ఉద్యమాన్ని అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నాయకుడు రాకేశ్ తకైత్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఉద్యమాన్ని పొడిగించాలని ప్రభుత్వం కోరుకుంటుందని, అందువల్ల రైతు నాయకులతో మాట్లాడటానికి ఇష్టపడ్డంలేదని ఆరోపించారు. ప్రభుత్వం కోరిన చోటకి రైతు నాయకులు చర్చల కోసం వస్తారని ఆయన స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకునేంతవరకూ రైతులు వెనక్కితగ్గరని ఆయన తేల్చి చెప్పారు.

  • 22 Dec 2020 09:27 AM (IST)

    ఎన్‌హెచ్‌ 24ను దిగ్భంధం చేసిన రైతులు

    నిరాహార దీక్షలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన రైతులు, రైతుసంఘాలు ఇవాళ ఉదయాన్నే నేషనల్ హైవే 24ను దిగ్భంధనం చేశారు. దీంతో ఘజియాబాద్ నుంచి ఢిల్లీకి రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు జాతీయ రహదారిపై అడ్డంగా కూర్చోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.

  • 22 Dec 2020 09:19 AM (IST)

    సింగు సరిహద్దు ప్రాంతంలో సమావేశం

    సింగు సరిహద్దు ప్రాంతంలో నిన్న జరగాల్సిన రైతు నాయకులతో సమావేశం అనివార్య కారణాలతో జరగలేదు. దీంతో తదుపరి వ్యూహం కోసం ఈ రోజు పంజాబ్ రైతు నాయకులు, జాతీయ రైతు నాయకులతో సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశాలలో, రైతు నాయకులతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లబోతోంది.