ఇన్‌స్టంట్ క్రెడిట్ యాప్‌ల కేసులో వెలుగు చూస్తున్న కొత్త నిజాలు.. వీటిని భరించలేకే ఆత్మహత్యలు..

ఇన్‌స్టంట్ క్రెడిట్ యాప్‌ల వల్ల ఇటీవల కొంతమంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వీటి అక్రమాలపై

ఇన్‌స్టంట్ క్రెడిట్ యాప్‌ల కేసులో వెలుగు చూస్తున్న కొత్త నిజాలు.. వీటిని భరించలేకే ఆత్మహత్యలు..
Follow us

|

Updated on: Dec 22, 2020 | 1:10 PM

ఇన్‌స్టంట్ క్రెడిట్ యాప్‌ల వల్ల ఇటీవల కొంతమంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వీటి అక్రమాలపై జనాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. అంతేకాకుండా ఈ యాప్‌ల వల్ల ఇబ్బంది పడుతున్న చాలామంది పోలీస్ స్టేషన్లలో కంప్లెంట్ ఇవ్వడానికి క్యూ కట్టారు. ఇలా నగరంలోని చాలా పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ యప్స్ నుంచి ఒక వ్యక్తి లోన్ తీసుకుంటే అతడి పర్సనల్ డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. అతడికి సంబంధించిన మొబైల్ కాంటాక్ట్స్ నెంబర్లన్నింటిని సేకరిస్తున్నారు. లోన్ తీసుకున్న వ్యక్తి డబ్బులు చెల్లించకుంటే అతడి కాంటాక్ట్స్‌లో ఉన్న వ్యక్తులందరికి కాల్ సెంటర్ల నుంచి మెసేజ్‌లు, టెక్స్ట్ పంపిస్తున్నారు. దీంతో మెసెజ్‌లు చూసి జనాలు అవాక్కవుతున్నారు. తమకు తెలియకుండానే తమ నెంబర్ షూరిటీగాఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా షూరిటీ గా మీ నంబర్ ఉంది కాబట్టి లోన్ చెల్లించే బాధ్యత మీదే అంటూ మెసేజ్‌లు రావడంతో జనాలు భయపడిపోతున్నారు. కేసులు పెడతామని బెదిరించడం తో జంకుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.