కరోనా వ్యాక్సిన్ ఫై ముస్లిముల ఆందోళన, టీకామందులో ‘అది కూడా ‘ కలిపారా ? వదంతుల మధ్య వితండ వాదం

కరోనా వైరస్ మహమ్మారిపై పోరుకు, కరోనా రోగులను రక్షించడానికి వవ్యాక్సిన్లు వెల్లువెత్తుతుండగా.. కొన్ని మత సంస్థలు కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చాయి.

కరోనా వ్యాక్సిన్ ఫై ముస్లిముల ఆందోళన, టీకామందులో 'అది కూడా ' కలిపారా ? వదంతుల మధ్య వితండ వాదం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 22, 2020 | 1:26 PM

కరోనా వైరస్ మహమ్మారిపై పోరుకు, కరోనా రోగులను రక్షించడానికి వవ్యాక్సిన్లు వెల్లువెత్తుతుండగా.. కొన్ని మత సంస్థలు కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చాయి. ఈ టీకామందుల్లో పోర్క్ ప్రాడక్టులను (పంది మాంస ఉత్పత్తులను) వినియోగిస్తున్నారని ముఖ్యంగా ముస్లిములు, యూదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిములకు ఈ మాంసం నిషేధం.   అసలు వ్యాక్సిన్ల లో వీటిని వినియోగిస్తున్నారా లేదా అన్నది నిర్ధారణ కాకపోయినప్పటికీ పలు ప్రపంచ దేశాల్లో వదంతులు మాత్రం జోరందుకుంటున్నాయి. దీనిపై ముస్లిం సమాజంలో అప్పుడే చర్చలు, డిబేట్లు మొదలయ్యాయి. అయితే ఒక వ్యక్తి ప్రాణాన్ని రక్షించాలంటే..’హరామ్’ అనే పదాన్ని వినియోగించవచ్చునని ఖురాన్ లో ఉందని కొందరు ముస్లిం స్కాలర్లు అంటున్నారు.  కానీ లేనిపోని వివాదాలకు దిగేబదులు కరోనా వైరస్ వ్యాక్సిన్లను తీసుకోవచ్చునని యూపీలో మౌలానా ఖాలిద్ రషీద్ అనే ముస్లిం నేత చెప్పారు. తమ వర్గం వారు ఈ విధమైన వదంతులను నమ్మరాదన్నారు.  మందు అన్నది మతానికి సంబంధించినది కాదని, ఒకరి ప్రాణాన్ని రక్షించడం ముఖ్యమని ఆయన అన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా టీకామందులను తేవడంలేదన్నారు.

వ్యాక్సిన్ ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే పోర్క్ ఉత్పత్తులను చాలావరకు వాడడం సహజమేనని బ్రిటిష్ ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సల్మాన్ వకార్ అంటున్నారు. కొన్ని సంస్థలు పోర్క్ లేని టీకామందులను ఉత్పత్తి చేస్తున్నాయని, కానీ అవి ఎంతకాలం నిల్వ ఉంటాయన్నది సందేహమేనన్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు