AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా సమయంలోనూ భారీ కానుకలు..అన్నవరం సత్యదేవుని దేవస్థాన కార్తిక మాస ఆదాయం ఎంతో తెలుసా..?

శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకం..అందులోనూ సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం. ప్రతి యేటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది.

కరోనా సమయంలోనూ భారీ కానుకలు..అన్నవరం సత్యదేవుని దేవస్థాన కార్తిక మాస ఆదాయం ఎంతో తెలుసా..?
Ram Naramaneni
|

Updated on: Dec 22, 2020 | 1:34 PM

Share

annavaram satyanarayana swamy : శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకం..అందులోనూ సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం. ప్రతి యేటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్ధశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు విశేషంగా పూజలు చేస్తుంటారు. కార్తీకమాసం వచ్చిందంటే ఆ నెల రోజులూ పండుగదినాలే. దేశ నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు.

కాగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి కార్తిక మాసంలో వివిధ విభాగాల ద్వారా రూ. 11.19 కోట్లు ఆదాయం సమకూరింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాదితో పోల్చితే భక్తుల రాక, వ్రతాల సంఖ్య 50 శాతం మేర తగ్గినా… ఆదాయం మాత్రం బాగానే సమకూరింది. హుండీల ద్వారా రూ. 1.86 కోట్లు,  వ్రతాల ద్వారా రూ. 3.63 కోట్లు, ప్రసాద విక్రయాలు ద్వారా రూ. 3.21 కోట్లు వచ్చింది. గతేడాది ఇదే సీజన్ లో అన్ని విభాగాల ద్వారా రూ. 16.44 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు.

Also Read : Lpg Gas Price: కీలక నిర్ణయం దిశగా ఆయిల్ కంపెనీలు..ఇకపై ప్రతి వారం మారనున్న సిలిండర్ ధర !