Golden temple: పంజాబ్‌ గోల్డెన్ టెంపుల్‌‌‌కు మరోసారి బాంబు బెదిరింపు కాల్.. చివరికి

|

Jun 03, 2023 | 7:30 PM

పంజాబ్‌లోని గోల్డోన్ టెంపుల్ ఎంత ప్రఖ్యాతి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిక్కులు పవిత్రస్థలంగా భావించే ఈ టెంపుల్ సమీపంలో గత నెలలో వేరు వేరు చోట్ల మూడు పేళుల్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Golden temple: పంజాబ్‌ గోల్డెన్ టెంపుల్‌‌‌కు మరోసారి బాంబు బెదిరింపు కాల్.. చివరికి
Golden Temple
Follow us on
పంజాబ్‌లోని గోల్డోన్ టెంపుల్ ఎంత ప్రఖ్యాతి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిక్కులు పవిత్రస్థలంగా భావించే ఈ టెంపుల్ సమీపంలో గత నెలలో వేరు వేరు చోట్ల మూడు పేళుల్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనలను ఇంకా మరవకముందే మరో వార్త కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం 1.00PM గంటలకు గోల్డెన్ టెంపుల్‌ సమీపంలో నాలుగు బాంబులు పెట్టామంటూ ఓ బెదిరింపు కాల్ రావడం స్థానికంగా సంచలనం రేపింది. ఇండియన్ ఆర్మీకి చెందిన ఆపరేషన్ బ్లూస్టర్ 39 వార్షికోత్సవం జూన్ 6న జరగనుంది. ఇలాంటి సమయంలో ఇలా బాంబు పెట్టామంటు కాల్ రావడంతో అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు గోల్డెన్ టెంపుల్‌కు చేరుకున్నారు.
బాంబ్‌ స్క్వాడ్‌ సాయంతో అన్ని చోట్ల క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు ఎక్కడా బాంబు జాడ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కాల్‌ ఎక్కడ నుంచి వచ్చింది.. దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటో అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఫోన్‌ లొకేషన్‌ను ట్రాక్ చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే దర్యాప్తులో తెలిందేంటంటే ఆ నిందితుడు దొంగిలించిన మొబైల్‌తో ఫోన్ చేసి బెదిరింపుకు పాల్పడినట్లు గుర్తించారు.  ఆ ఫోన్‌తో కాల్‌ చేసినా పోలీసులు కనిపెట్టలేరనుకున్నాని ఊరేకే తప్పుడు ఫోన్‌ చేసినట్లు చెప్పాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి