Police: పెట్టుబడి పేరుతో పోలీసులందరిని నమ్మించి బురిడి కొట్టించిన మరో పోలీసు అధికారి

|

Apr 01, 2023 | 3:58 PM

పెట్టుబడుల పేరుతో కొంతమంది కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తుంటారు. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వచ్చేలా చేస్తామంటూ నమ్మించి వచ్చిన డబ్బులతో పరారవుతారు. అలాంటి ఘటనే తాజాగా తమిళనాడులో జరిగింది.

Police: పెట్టుబడి పేరుతో పోలీసులందరిని నమ్మించి బురిడి కొట్టించిన మరో పోలీసు అధికారి
Business Idea
Follow us on

పెట్టుబడుల పేరుతో కొంతమంది కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తుంటారు. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వచ్చేలా చేస్తామంటూ నమ్మించి వచ్చిన డబ్బులతో పరారవుతారు. అలాంటి ఘటనే తాజాగా తమిళనాడులో జరిగింది. ఆసక్తికర విషయమేమిటంటే పోలీసే నిందితుడు.. బాధితులంతా పోలీసు శాఖలో ఉన్నవారే. ప్రజలను రక్షించాల్సిన పోలీసు అధికారే ఇలాంటి మోసానికి పాల్పడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కాంచీపురం జిల్లాలో అరుణ్ అనే పోలీసు అధికారి ట్రాఫిగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. అరుణ్ కుటుంబ సభ్యులు అందరూ కూడా పోలీస్ శాఖలోనే వివిధ విభాగాల్లో విధుల్లో ఉన్నారు.

అరుణ్ అన్నయ్యలిద్దరికీ వ్యాపారాలు కూడా ఉన్నాయి. అయితే వాళ్లలాగే అరుణ్ కూడా ఓ వ్యాపారం పెడదామనుకుని ఫైనన్సు చేయడం ప్రారంభించాడు. రూ. లక్ష పెట్టుబడి పెడితే ఏడాదిలో అదనంగా రూ.30 వేలు వస్తాయని అందర్ని నమ్మించాడు. అరుణ్ కుటుంబ సభ్యులు కూడా పోలీస్ శాఖలో ఉండటంతో చాలామంది పోలీసులు అతడ్ని నమ్మారు. ఒక్కొక్కరు వేల నుంచి లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. దాదాపు ఆ డబ్బులు మొత్తం రూ.40 కోట్ల వరకు అయ్యాయి. ఇక అరుణ్ తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. భార్యతో కలిసి నిన్న రాత్రి ఆ డబ్బులతో పారిపోవడంతో అసలు విషయం బయటపడింది. చివరికి పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే అరుణ్ కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..