
అతడొక ఫుడ్ డెలివరీ బాయ్. ఓ రోజు రాత్రి కస్టమర్ ఇంటికి ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్లాడు. పార్కింగ్‌లో బైక్ పెట్టి.. పార్శిల్ ఇచ్చి.. తిరిగి వచ్చేసరికి బైక్ కనిపించలేదు. దీంతో వెంటనే సదరు యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలను ఖాకీలు చెక్ చేయగా.. అందులో కనిపించిన దృశ్యాన్ని చూసి వారు దెబ్బకు కంగుతిన్నారు. ఆ దొంగ ఎవరనుకుంటున్నారు.? ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకోగా.. దాని వివరాల్లోకి వెళ్తే..
ప్రతాప్‌గడ్‌కు చెందిన దీపక్ అనే డెలివరీ బాయ్ శనివారం ఓ ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు స్థానిక బర్కత్ నగర్‌కు వెళ్లాడు. అతడు కస్టమర్‌కు పార్శిల్ ఇచ్చి.. తిరిగి వచ్చేసరికి బైక్ మాయమైంది. దీంతో దీపక్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలు చెక్ చేయగా.. దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అంబామాత పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తోన్న విక్రాంత్ మాస్టర్ కీ ద్వారా బైక్ తీసుకుని వెళ్ళినట్లు గుర్తించారు. అప్పటికే ఆ కానిస్టేబుల్.. అదే ప్రాంతంలో ఉన్న పలువురితో గొడవ పడినట్లు పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో అతడిపై ఖాకీలు కేసు నమోదు చేసి.. దీపక్‌కు బైక్ తిరిగి ఇప్పించారు.