Crime: కుమార్తెల ప్రాణాలు తీసిన తల్లి వివాహేతర సంబంధం.. పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు

|

Apr 08, 2022 | 6:03 PM

వివాహేతర సంబంధానికి ఇద్దరు చిన్నారులు బలయ్యారు. భర్తతో కాకుండా వేరే వ్యక్తికి పుట్టిన శిశువులను అత్యంత కర్కశంగా చంపేసింది(Murder) ఆ తల్లి. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేసింది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన పెను సంచలనం...

Crime: కుమార్తెల ప్రాణాలు తీసిన తల్లి వివాహేతర సంబంధం.. పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు
Child
Follow us on

వివాహేతర సంబంధానికి ఇద్దరు చిన్నారులు బలయ్యారు. భర్తతో కాకుండా వేరే వ్యక్తికి పుట్టిన శిశువులను అత్యంత కర్కశంగా చంపేసింది ఆ తల్లి. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేసింది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది. ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విచారించగా అసులు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడులోని(Tamil Nadu) తెన్ కాశీ జిల్లా శంకరన్‌కోయిల్ గ్రామంలో 2018 లో చెరువులో చిన్నారి మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పటికీ.. నిందితులను పట్టుకోలేకపోయారు. కొన్ని సంవత్సరాలుగా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు మరోసారి దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుల కోసం నోచికులం, ఆ గ్రామ సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న వల్లరాంపురానికి చెందిన శశికుమార్, ముతుమారిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది.

ముతుమారికి మాడసామి అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం. దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఫలితంగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఆ తరువాత ముతుమారి తన కూతురు, కొడుకుతో కలిసి నోచికులం వెళ్లింది. ఆ సమయంలో వల్లరాంపురానికి చెందిన శశికుమార్​తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. వీరికి 2018లో ఒక పాప పుట్టింది. ఈ బిడ్డ వల్ల తమ వివాహేతర బంధం బయటపడుతుందనే భయంతో ఐదు రోజుల పసికందును చెరువులో పడేశారు. ఆపై అక్కడి నుంచి పరారయ్యారు.

అదే విధంగా 2019లో వీరికి మరో పాప జన్మించింది. ఈ చిన్నారిని హత్య చేసి ముతుమారి ఇంటి సమీపంలో పాతిపెట్టి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఊర్లోకి రాలేదు. మళ్లీ కొన్ని రోజుల కిందటే గ్రామానికి రాగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read : Tax Issue: టాక్స్ చెల్లించని దిగ్గజ వ్యాపారి కుమార్తె.. ప్రజలపై భారీగా పన్నులు పెంచారంటూ ప్రతిపక్షాల విమర్శలు

CSK vs SRH IPL 2022 Match Prediction: చెన్నైతో హైదరాబాద్ ఢీ.. బలాలు, రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Viral Video: టోపీలా మారే మేఘాన్ని ఎప్పుడైనా చూశారా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియోపై ఓ లుక్కేయండి..