KSRTC Conductor : చీ.. చీ ఇదేం పాడు పనిరా బాబు.. మరీ ఇంత నీచమా!.. బస్సులో నిద్రిస్తున్న మహిళతో…

సమాజంలో రోజురోజుకు ఆగవాళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు, కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వారిపై జరుగుతున్న లైంగిక దాడులు తగ్గడం లేదు. కొందరు కామాందులు అమ్మాయిలను చూస్తే చాలా తమ వక్రబుద్దిని బయటపెడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని KSRTC బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

KSRTC Conductor : చీ.. చీ ఇదేం పాడు పనిరా బాబు.. మరీ ఇంత నీచమా!.. బస్సులో నిద్రిస్తున్న మహిళతో...
Ksrtc Condector

Updated on: Apr 25, 2025 | 10:12 PM

సమాజంలో రోజురోజుకు ఆడవాళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వారిపై జరుగుతున్న లైంగిక దాడులు మాత్రం తగ్గడం లేదు. కొందరు కామాందులు అమ్మాయిలను చూస్తే చాలా తమ వక్రబుద్దిని బయటపెడుతున్నారు. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అని కూడా ఆలోచించట్లేదు. అక్కడ పడితే అక్కడ దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో చోటుచేసుకుంది. బస్సులో నిద్రిస్తున్న ఓ మహిళతో ఆ బస్సు కండక్టర్‌ అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన వారందూ ఆ కండక్టర్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ముడిపి నుంచి మంగళూరుకు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సులో ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఆ బస్సు కండక్టర్. నిద్రలో ఉన్న మహిళకు దగ్గరగా వెళ్లి శరీరంపై అసభ్యకరంగా  తాకాడు. అయితే ఆ కండక్టర్‌ వ్యవహారాన్ని మొత్తం పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఆధారంగా కండక్టర్‌ ప్రదీప్‌పై భారతీయ న్యాయసంహిత సెక్షన్ 74 (అశ్లీల ప్రవర్తన), సెక్షన్ 75 (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత అతన్ని కోర్ట్ లో హాజరుపరిచారు. దీంతో కోర్టు అతనికి 15 రోజుల రిమాండ్ విధించింది.

మరోవైపు ఈ ఘటనపై స్పందించిన కేఎస్‌ఆర్టీసీ ప్రదీప్‌ను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించింది. ఇదే విషయంపై అటు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కెఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…